తెలంగాణలో ఓటర్ల జాబితాలో అవకతవకలు జరిగాయని దాఖలైన పిటీషన్లపై శుక్రవారం హైకోర్టులో విచారణ జరిగింది. కాంగ్రెస్ నేత మర్రి శశిధర్ రెడ్డి మొదట ఈ విషయంపై సుప్రీంకోర్టుకు వెళ్లగా... హైకోర్టుకు ఈ కేసును బదలాయించింది. ఇవాళ కోర్టు ఈ పిటీషన్ పై విచారణ జరిపింది. మర్రి శశిధర్ రెడ్డి పిటీషన్ హైకోర్టులో వాదనలు జరిగాయి. ఆంధ్రా ఓట్లు 20 లక్షలు అక్కడికి బదిలీ అయ్యాయని ప్రభుత్వం చెస్తోన్న వాదన తప్పని పిటీషనర్ తరపు న్యాయవాది వాదించారు. పిటీషనర్ అభ్యంతరాలపై వివరణ ఇవ్వాల్సిందిగా కోర్టు ఎన్నికల సంఘాన్ని ఆదేశించిది. తదుపరి విచారణను సోమవారానికి వాయిదా వేసింది. ఈ విచారణ పూర్తయ్యే వరకు ఎన్నికల ప్రక్రియ మొదలు పెట్టడానికి వీలులేదు.