ఆదాయపు పన్ను రీఫండ్‌ను త్వరగా పొందాలనుకుంటున్నారా..?

ఆదాయపు పన్ను రీఫండ్‌ను త్వరగా పొందాలనుకుంటున్నారా..? ఈ విషయాలు తెలుసుకోండి

Update: 2023-08-07 06:04 GMT

Income Tax రిఫండ్ : ఆదాయపు పన్ను రీఫండ్‌ను త్వరగా పొందాలనుకుంటున్నారా..? ఈ విషయాలు తెలుసుకోండి

ఆదాయపు పన్ను శాఖ ఇప్పటికీ రిటర్న్‌ను దాఖలు చేస్తోంది. జూలై 31 తర్వాత పెనాల్టీతో కూడిన ఆదాయపు పన్ను రిటర్న్‌ దాఖలు చేసేందుకు అనుమతి ఇస్తున్నారు ఇన్‌కమ్‌ ట్యాక్స్‌ అధికారులు. వార్షికాదాయం రూ.5 లక్షలు ఉన్నవారికి రూ.5 వేలు, ఆపై ఆదాయం ఉన్నవారికి రూ.10వేల చొప్పున పెనాల్టీ విధిస్తున్నారు. అయితే ఆదాయపన్ను రీఫండ్‌ త్వరగా పొందేందుకు కొన్ని మార్గాలను అనుసరించడం మంచిదంటున్నారు ఆర్థిక నిపుణులు. మరోవైపు మీరు రిటర్న్ దాఖలు చేసినప్పటికీ కొన్ని విషయాలు తెలుసుకోవడం మంచిది.

ఆదాయపు పన్ను రిటర్న్‌ను దాఖలు చేసేటప్పుడు పన్ను చెల్లింపుదారులు వాపసు కోసం వేచి చూస్తుంటారు. అటువంటి పరిస్థితిలో రిటర్న్ దాఖలు చేసేటప్పుడు సరైన ప్రక్రియను అనుసరించడం అవసరం. ఈ ప్రక్రియతో మీరు సులభంగా రీఫండ్‌ పొందేందుకు ఆస్కారం ఉంటుంది. ఆదాయపు పన్ను శాఖ కూడా ఇదే విధానాన్ని అనుసరించాలని పన్ను చెల్లింపుదారులను కోరుతోంది.

సరైన ఫారమ్‌ని ఉపయోగించడం వలన ఎలాంటి అంతరాయాలు లేకుండా రిటర్న్స్‌ పొందవచ్చని గుర్తించుకోండి. తప్పుడు ఫారాన్ని ఎంపిక చేసుకుని వివరాలు నమోదు చేస్తే ఇబ్బందులు ఎదుర్కొవచ్చు. ఒక వేళ ఫైల్ చేసిన తర్వాత అధికారుల పరిశీలన, రీఫండ్‌ రావడంలో మరింత ఆలస్యం కావచ్చు.

ఖచ్చితమైన సమాచారం ఇవ్వండి:

మీరు ఆదాయపు పన్ను రీఫండ్‌ కోసం ఫైల్‌ చేస్తున్నట్లయితే అందులో ఖచ్చితమైన సమాచారాన్ని ఇవ్వడం మంచిది. పూర్తి వివరాలతో అందించినట్లయితే మీ రీఫండ్‌ అనేది మీ ఖాతాలో త్వరగా జమ అవుతుంది. ఇలా సరైన పద్దతుల్లో ఫైల్‌ చేసినట్లయితే ఎలాంటి ఇబ్బంది లేకుండా రీఫండ్ మీ ఖాతాకు చేరుతుంది. అయితే, మీరు పాన్‌ వివరాలు తప్పుగా ఇచ్చినా.. ఇతర సమాచారం కూడా సరిగ్గా లేకుంటే రీఫండ్‌ చెల్లింపుల్లో మరింత ఆలస్యం కావచ్చని గుర్తించుకోండి. మీరు సమయానికి ఐటీఆర్‌ ఫైల్ చేస్తే ఐటీ శాఖ పన్ను చెల్లింపుదారుల ఖాతాకు సులభంగా రీఫండ్‌ను జారీ చేస్తుంది.

ధృవీకరణ అవసరం:

మీరు ఐటీఆర్ ఫైల్ చేస్తున్నట్లయితే, వెరిఫికేషన్ చేయడం తప్పనిసరి. మీ మొబైల్ నంబర్, బ్యాంక్ ఖాతా ఆధార్‌తో లింక్ చేయబడితే మీరు ఇ-ధృవీకరణ కోడ్ ఆప్షన్‌ను ఎంచుకోవచ్చు. మరోవైపు నెట్ బ్యాంకింగ్ ఉంటే పోర్టల్ మిమ్మల్ని బ్యాంక్ సైట్‌కి దారి మళ్లిస్తుంది.

రిటర్న్స్‌లను తక్షణమే ధృవీకరించండి :

ఆన్‌లైన్ ఫైలింగ్, ఇ-ధృవీకరణ పోర్టల్ ద్వారా ఆన్‌లైన్ ఫైలింగ్ వేగంగా, మరింత సమర్థవంతంగా ఉంటుంది. రిటర్న్ ఫైల్ చేసిన వెంటనే ఇ-వెరిఫై చేయాలి.

Tags:    

Similar News