పాక్ అభిమానులకు భారీ డిస్కౌంట్.. అదొక్కటే ఊరట!
ఇండియా పాకిస్తాన్ జట్ల మధ్య క్రికెట్ మ్యాచ్ ఎప్పుడూ హై ఓల్టేజీ వాతావరణంలోనే జరుగుతూ ఉంటుంది. ప్రపంచ కప్ (యాభై ఓవర్ల క్రికెట్ మ్యాచ్) లో పాకిస్తాన్ ఒక్కసారి కూడా గెలిచిన పాపాన పోలేదు. వరల్డ్ కప్ లో ఇప్పటి వరకూ రెండు దేశాల మధ్యతొమ్మిది మ్యాచ్‌లు జరగగా... అన్నిట్లోనూ భారత జట్టే పై చేయి సాధించింది.
ఇండియా పాకిస్తాన్ జట్ల మధ్య క్రికెట్ మ్యాచ్ ఎప్పుడూ హై ఓల్టేజీ వాతావరణంలోనే జరుగుతూ ఉంటుంది. ప్రపంచ కప్ (యాభై ఓవర్ల క్రికెట్ మ్యాచ్) లో పాకిస్తాన్ ఒక్కసారి కూడా గెలిచిన పాపాన పోలేదు. వరల్డ్ కప్ లో ఇప్పటి వరకూ రెండు దేశాల మధ్యతొమ్మిది మ్యాచ్‌లు జరగగా... అన్నిట్లోనూ భారత జట్టే పై చేయి సాధించింది.
శనివారం అహ్మదాబాద్‌లో జరిగిన వన్డే ఇంటర్నేషనల్‌లో కూడా భారత్ ఏడు వికెట్ల తేడాతో దాయాది జట్టును నేల కరిపించింది. తొలుత బ్యాటింగ్ చేసిన పాకిస్తాన్ ఓ దశలో 150 పరుగులకు రెండు వికెట్లు మాత్రమే కోల్పోయి పటిష్ట స్థితిలో ఉన్నట్లు కనిపించినా కేవలం నలభై పరుగులకే మిగిలిన ఎనిమిది వికెట్లను సమర్పించుకుని భారత్‌కు ఆధిపత్యాన్ని అందించింది. ఈ లక్ష్యాన్ని ముప్పయ్ ఓవర్లలో సునాయాసంగా అధిగమించి, టీం ఇండియా మమ అనిపించింది.
ఇండియా, పాక్ ఆడుతున్నప్పుడు... అభిమానుల అటెన్షన్‌ను ఆకర్షించడానికి వ్యాపార సంస్థలు కూడా పోటీ పడుతుంటాయి. ప్రముఖ ట్రావెల్ కంపెనీ ‘మేక్ మై ట్రిప్’... పాకిస్తాన్ అభిమానులకు ఓ బంపర్ ఆఫర్ ఇచ్చింది. తమ సంస్థతో ఒప్పందం కుదుర్చుకున్న హోటళ్లలో పాకిస్తాన్ అభిమానులు బస చేస్తే, వారికి హోటల్ బిల్స్ లో యాభై శాతం డిస్కౌంట్‌ను ప్రకటించింది. ఈ డిస్కౌంట్ వర్తించడానికి పెట్టిన కండిషన్ మాత్రం పాక్ అభిమాలుకి మింగుడు పడదు. భారత్ తో జరిగే మ్యాచ్‌లో పాకిస్తాన్ ఓడిపోవాలి. అదే ఆ ఆ కండిషన్. 10 వికెట్లు లేదా 200 పరుగుల తేడాతో భారత్ గెలిస్తే బిల్లులో యాభై శాతం డిస్కౌంట్ లభిస్తుంది. ఆరు లేదా అంతకంటే ఎక్కువ వికెట్లు, 100 పరుగుల తేడా అయితే ముప్పయ్ శాతం, మూడు వికెట్లు, యాభై పరుగుల తేడాతో భారత్ గెలిస్తే పది శాతం డిస్కౌంట్ అందుతుంది. ఈ అవకాశం పాకిస్తాన్ అభిమానులకు మాత్రమే సొంతం.
‘అతిధి దేవో భవ’ అనే భారతీయ సిద్ధాంతం ప్రకారం పాక్ అభిమానులకు ఈ అవకాశం ఇస్తున్నట్లు మేక్ మై ట్రిప్ ప్రకటించింది. ఈ ప్రకటన నెటిజన్లను బాగా ఆకర్షిస్తోంది. నిన్నటి తరం డాషింగ్ బ్యాట్స్‌మెన్ వీరేంద్ర సెహ్వాగ్ తన ‘ఎక్స్’ అకౌంట్ ద్వారా ఈ విషయాన్ని షేర్ చేశారు. శనివారం జరిగిన మ్యాచ్ లో భారత్ ఏడు వికెట్ల తేడాతో గెలవడంతో ప్రతీ పాకిస్తాన్ అభిమాని ముప్పయ్ శాతం డిస్కౌంట్‌ను వినియోగించుకోవచ్చు. అహ్మదాబాద్‌లో బస చేసిన పాక్ అభిమానులకు ఇదొక్కటే కాస్త ఊరట!