ఆంధ్రప్రదేశ్ లో నేడు ఆదాయపు పన్ను శాఖ దాడులు జరగనున్నాయా? అవును. నిన్న రాత్రే ఢిల్లీ నుంచి కొన్ని ఐటీ బృందాలు విజయవాడ చేరుకున్నాయి. ఈరోజు ఏపీలో ఐటీ దాడులు జరిగే అవకాశముందని తెలుస్తోంది. ఢిల్లీ వచ్చిన ఐటీ శాఖ అధికారులు ఏపీ పోలీసుల సాయం కోరినట్లు తెలుస్తోంది. పలువురు రాజకీయ నేతల ఇళ్లలో సోదాలు జరిగే అవకాశముందని తెలుస్తోంది. ఈ సందర్భంగా పలువురు ప్రముఖులు, వ్యాపారులు, తెలుగుదేశం పార్టీ సన్నిహితులు, కాంట్రాక్టర్ల ఇళ్లపై ఐటీ దాడులు జరిగే అవకాశముందని చెబుతున్నారు. తెలుగుదేశం పార్టీ నేతలు మాత్రం ఇది తాము ముందుగా ఊహించిందేనంటున్నారు. నిన్న నెల్లూరు జిల్లా తెలుగుదేశం నేతలు బీద సోదరుల కార్యాలయపై ఐటీ అధికారులు సోదాలు చేసిన సంగతి తెలిసిందే.