షాకింగ్ : టీడీపీకి షాక్......ఐటీ వలలో సీఎం రమేష్.....!

Update: 2018-10-12 03:47 GMT

తెలుగుదేశం పార్టీలోని కీలక నేతల ఆదాయామార్గాలపై బిజెపి ఐటి బాణం ఎక్కుపెట్టిందా? క్షేత్రస్ధాయిలో జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే అవుననే అనిపిస్తోంది. ముఖ్యంగా చంద్రబాబునాయుడుకు సన్నిహితంగా ఉంటూ పార్టీకి ఆర్ధికంగా అండదండలు అందిస్తున్న నేతల సంపాదన మార్గాలను లక్ష్యంగా పెట్టుకున్నట్లు సమాచారం. అందులో భాగంగానే ముందుగా సిఎం రమేష్ ప్రాజెక్టులపై దృష్టి పెట్టింది. తాజాగా సీఎం రమేష్ కు చెందిన కార్యాలయాలపై ఆదాయపు పన్ను శఆఖ దాడులు జరుగుతున్నాయి. ఈరోజు తెల్లవారు జామునుంచే ఐటీ దాడులు ప్రారంభమయ్యాయి. హైదరాబాద్, కడపలలో ఈ సోదాలు జరుగుతున్నట్లు సమాచారం. కడప జిల్లా ఎర్రగుంట్ల మండలం పొట్లదుర్తి గ్రామంలోని ఆ స్వగ్రహంలోనూ సోదాలు ప్రారంభమయ్యాయి.ప్రస్తుతం సీఎం రమేష్ ఢిల్లీలో ఉన్నారు.

టీడీపీ అధికారంలోకి రాగానే.....

నాలుగేళ్ళ క్రితం వరకూ సిఎం రమేష్ ప్రాజెక్టులు ఆర్ధికంగా పెద్ద చెప్పుకోదగ్గ స్ధాయిలో లేవు. ఎప్పుడైతే టిడిపి అధికారంలోకి వచ్చిందో అప్పటి నుండి రమేష్ ప్రాజెక్టులు ఒక్కసారిగా పుంజుకున్నాయి. ప్రధానంగా రాయలసీమలోని గాలేరు-నగిరి, హంద్రీ-నీవా, వంశధార ఇరిగేషన్ తదితర ప్రాజెక్టుల పనులు చేస్తున్నారు.

అంచనాలు పెంచుకుని.......

సిఎం రమేష్ పై ఉన్న ప్రధానమైన ఆరోపణలేమిటంటే, అప్పటి వరకూ ఉన్న ప్రాజెక్టల అంచనాలను పెంచేసి డబ్బులు చేసుకున్నారనేది. ఇదే విషయమై బిజెపిలోని రాయలసీమ నేతలు కొందరు ప్రత్యేకంగా క్షేత్రస్ధాయి పరిశీలన జరిపారు. ప్రాజెక్టుల పనులు జరుగుతున్న తీరు, వాస్తవ అంచనాలు, చెల్లించిన బిల్లులు, పెండింగ్ లో ఉన్న పనులు, బిల్లులు లాంటి అన్ని విషయాలపైనా పూర్తి సమాచారం సేకరించారు. ప్రాజెక్టుల ముసుగులో భారీ అవినీతి జరుగుతోందనే నిర్ధారణకు వచ్చారు. ఉక్కు ఫ్యాకర్టీ గురించి తాను ఉద్యమం చేస్తున్నందునే కేంద్రం కక్ష కట్టి తనపై ఐటీ దాడులు చేయిస్తుందని సీఎం రమేష్ ఆరోపిస్తున్నారు. ఏకకాలంలో వందమంది ఐటీ అధికారులు ఈ దాడులు చేస్తున్నట్లు సమాచారం.

Similar News