ఇకపై మన దేశం ఇండియా కాదు...భారత్‌!

అవును. మీరు చదువుతున్నది నిజం. ఇకపై మనం ఇండియన్స్‌ కాదు. భారతీయులం. ఇండియా పేరును భారత్‌గా మారుస్తూ కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకోనుంది. రాబోయే పార్లమెంట్‌ సమావేశాల్లో ఈ బిల్లును కూడా ప్రవేశపెట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ ప్రపంచంలో కేవలం మన దేశానికి మాత్రమే రెండు పేర్లు ఉన్నాయి. కొన్ని దేశాలకు పాత పేర్లున్నా, అవి కొత్త పేర్లతోనే ఛలామణి అవుతున్నాయి. కానీ మనదేశాన్ని మాత్రమే ఇండియా, భారత్‌ అని పిలుస్తారు. విదేశాల్లో ‘ఇండియా’ గానే ఈ దేశం ప్రాచుర్యం పొందింది.

Update: 2023-09-05 10:17 GMT

కేంద్ర ప్రభుత్వ కీలక నిర్ణయం వచ్చే పార్లమెంట్ సమావేశాల్లో బిల్లు 

అవును. మీరు చదువుతున్నది నిజం. ఇకపై మనం ఇండియన్స్‌ కాదు. భారతీయులం. ఇండియా పేరును భారత్‌గా మారుస్తూ కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకోనుంది. రాబోయే పార్లమెంట్‌ సమావేశాల్లో ఈ బిల్లును కూడా ప్రవేశపెట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ ప్రపంచంలో కేవలం మన దేశానికి మాత్రమే రెండు పేర్లు ఉన్నాయి. కొన్ని దేశాలకు పాత పేర్లున్నా, అవి కొత్త పేర్లతోనే ఛలామణి అవుతున్నాయి. కానీ మనదేశాన్ని మాత్రమే ఇండియా, భారత్‌ అని పిలుస్తారు. విదేశాల్లో ‘ఇండియా’ గానే ఈ దేశం ప్రాచుర్యం పొందింది.

ఇండియాను భారత్‌గా మార్చాలని సంఘ్ పరివార్‌ మొదట్నుంచీ కోరుతూనే ఉంది. ఇప్పుడు అది కార్యరూపం దాల్చే సమయం ఆసన్నమైంది. భారత ప్రభుత్వం మన దేశానికి ఒకే పేరును ఖాయపరుస్తూ దాదాపుగా నిర్ణయం తీసుకున్నట్లే. రాష్ట్రపతి కార్యాలయం నుంచి విడుదలైన ఓ ప్రకటన ఈ విషయాన్ని ఖాయపరుస్తోంది. జి`20 దేశాల ప్రతినిధుల గౌరవార్ధం ఈనెల తొమ్మిదో తేదీ రాత్రి రాష్ట్రపతి భవన్‌ ఓ విందు ఇస్తోంది. ఆ ఆహ్వాన పత్రికపై ‘ప్రెసిడెంట్‌ ఆఫ్‌ భారత్‌’ అని ముద్రించి ఉంది. విదేశీయుల వద్ద ప్రస్తావించినప్పుడు మన దేశాన్ని ‘ఇండియా’ అనే సంబోధిస్తారు. కానీ అధికారిక కార్యక్రమంలో ‘భారత్‌’ అని ప్రస్తావించడం తప్పుగానో, అన్యాపదేశంగానో జరిగిన మార్పు కాదు. ప్రభుత్వ పెద్దల అనుమతితో జరిగిందని ప్రతిపక్ష పార్టీలు ఆరోపిస్తున్నాయి.

ఈ మార్పుపై కాంగ్రెస్‌ సీనియర్‌ నేత జైరామ్‌ రమేష్‌ ఎక్స్‌ (ఒకప్పటి ట్విటర్‌) వేదికగా విమర్శలు గుప్పించారు. ‘రాజ్యాంగంలోని ఒకటో ఆర్టికల్‌ ప్రకారం భారత్‌ (ఒకప్పటి ఇండియా)రాష్ట్రాల యూనియన్‌గా ఉంటుంది’ అని చదువుకోవాలి’ అని వ్యంగ్యంగా వ్యాఖ్యానించారు. ‘ఇప్పుడు రాష్ట్రాల యూనియన్‌ అనే మాట కూడా ప్రమాదంలో పడిరది’ అని ఆరోపించారు.

తమిళనాడు ముఖ్యమంత్రి ఎం.కె.స్టాలిన్‌ కూడా భాజపాపై నిప్పులు చెరిగారు. ’ఇండియాను మారుస్తానని తొమ్మిదేళ్ల కిందట భాజపా అధికారంలోకి వచ్చింది. ఇప్పుడు ఇండియా పేరును మాత్రం మారుస్తోంది’ అంటూ విమర్శించారు. ‘ప్రతిపక్షాల కూటమి ‘ఇండియా’ బ్లాక్‌గా ఏర్పడటంతో కేంద్ర అధికార కూటమిలో ఆందోళన మొదలైంది. అందుకే ‘ఇండియా’ అనే పేరును భారత్‌గా మార్చాలనుకుంటోంది. రాబోయే ఎన్నికల్లో మాత్రం ప్రతిపక్షాల ‘ఇండియా’ కూటమి భాజపాను తరిమి తరిమి కొడుతుంది’ అంటూ ఎక్స్‌ వేదికగా ఘాటుగా స్పందించారు.

మెజార్టీ జనాల్లో మళ్లీ ‘దేశభక్తి’ని నింపే విధంగా, ఆ భక్తి తమకు ఓట్లుగా మారేలా భాజపా చాలా వేగంగా పావులు కదుపుతోంది. మరి అతుకుల బొంత అయిన ప్రతిపక్షాల కూటమి... మోదీ టీం వర్క్‌ను ఎలా ఎదుర్కొంటుందో చూడాలి. ఏదేమైనా ఇకపై మనం ఇండియన్స్‌ కాకపోవచ్చు. ఏ దేశమేగినా ఇక భారతీయులమే అవుతాం.

Tags:    

Similar News