నేనైనా ప్రభుత్వ ఆసుపత్రికే వెళ్లాలి
తాము అధికారంలోకి వచ్చాక ప్రభుత్వ ఆసుపత్రులపై ప్రత్యేక దృష్టి పెడతామని ప్రతిపక్ష నేత వై.ఎస్. జగన్మోహన్ రెడ్డి పేర్కొన్నారు. సోమవారం అనంతపురంలో ఆయన తటస్థులతో ‘అన్న పిలుపు’ [more]
తాము అధికారంలోకి వచ్చాక ప్రభుత్వ ఆసుపత్రులపై ప్రత్యేక దృష్టి పెడతామని ప్రతిపక్ష నేత వై.ఎస్. జగన్మోహన్ రెడ్డి పేర్కొన్నారు. సోమవారం అనంతపురంలో ఆయన తటస్థులతో ‘అన్న పిలుపు’ [more]
తాము అధికారంలోకి వచ్చాక ప్రభుత్వ ఆసుపత్రులపై ప్రత్యేక దృష్టి పెడతామని ప్రతిపక్ష నేత వై.ఎస్. జగన్మోహన్ రెడ్డి పేర్కొన్నారు. సోమవారం అనంతపురంలో ఆయన తటస్థులతో ‘అన్న పిలుపు’ సమావేశం నిర్వహించారు. తటస్థుల నుంచి రాష్ట్రాభివృద్ధికి, వివిధ అంశాలపై సలహాలు సూచనలు తీసుకున్నారు. ఈ సందర్భంగా జగన్ మాట్లాడుతూ… తమ ప్రభుత్వం అధికారంలోకి రాగానే పీహెచ్సీల నుంచి అన్ని ప్రభుత్వ ఆసుపత్రులపై ప్రత్యేక దృష్టి పెడతామని తెలిపారు. రెండేళ్లలో ప్రభుత్వ ఆసుపత్రుల పనితీరు మెరుగుపరుస్తామన్నారు. తర్వాత తనతో సహా ప్రజా ప్రతినిధులు ఎవరైనా ప్రభుత్వ ఆసుపత్రుల్లోనే చికిత్స చేయించుకుంటామని, అలా అయితేనే ప్రజల్లో నమ్మకం ఏర్పడుతుందన్నారు. ఇక, ఉద్యోగాల సమస్య పరిష్కరించేందుకు ప్రైవేటు సంస్థల్లో 70 శాతం ఉద్యోగాలు స్థానికులకే ఇచ్చేలా మొదటి శాసనసభలోనే చట్టం చేస్తామన్నారు. స్థానిక నిరుద్యోగులకు కావాల్సిన నైపుణ్యాలను అభివృద్ధి చేసేందుకు ప్రతీ జిల్లాకు రెండు స్కిల్ డెవలప్మెంట్ సెంటర్లు ఏర్పాటు చేస్తామన్నారు.