ఏపీకి ప్రత్యేక హోదా కోసం పార్లమెంటులో అవిశ్వాస తీర్మానం పెట్టి జగన్ ఒకడుగు ముందుకేశాడని మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ పేర్కొన్నారు. 25 సీట్లు ఇస్తే ఏం చక్రం తిప్పుతాడో చంద్రబాబు నాయుడు చెప్పాలని కోరారు. కేంద్రం ఇచ్చిన నిధులపై మన ప్రభుత్వం నిజంగానే యూసీలు ఇచ్చి ఉంటే ఆన్ లైన్ లో ఎందుకు పెట్టలేదని ప్రశ్నించారు. మహారాష్ట్ర బీజేపీ మంత్రి భార్యను టీటీడీలో ఎలా నియమిస్తారని ప్రశ్నించారు. మన చేతగానితనం వల్లే ఏపీకి అన్యాయం జరుగుతుందన్నారు. టీటీడీపై రమణ దీక్షితులు చేస్తున్న ఆరోపణలపై సీబీఐ విచారణ చేస్తే తప్పేంటని, 2008లో అసెంబ్లీలో టీటీడీపై సీబీఐ విచారణకు చంద్రబాబు డిమాండ్ చేశారని గుర్తుచేశారు. ఏపీ విభజన రాజ్యాంగబద్ధంగా జరగలేదని, పార్లమెంటు తలుపులు మూసేసి ఏపీకి అన్యాయం చేశారన్నారు.