వారికి జనసేన మద్దతు

తెలంగాణలో ఆర్టీసీ కార్మికులు చేపట్టిన సమ్మెకు జనసేన పార్టీ మద్దతు ప్రకటించింది. ఈ నెల 19న తలపెట్టిన తెలంగాణ రాష్ట్ర బంద్‌కు కూడా మద్దతు తెలిపింది. జనసేన [more]

;

Update: 2019-10-14 07:52 GMT
వారికి జనసేన మద్దతు
  • whatsapp icon

తెలంగాణలో ఆర్టీసీ కార్మికులు చేపట్టిన సమ్మెకు జనసేన పార్టీ మద్దతు ప్రకటించింది. ఈ నెల 19న తలపెట్టిన తెలంగాణ రాష్ట్ర బంద్‌కు కూడా మద్దతు తెలిపింది. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ను కలిసిన ఆర్టీసీ జేఏసీ నేతలతో బంద్‌కు మద్దతు ఇస్తున్నట్టు ప్రకటించారు పవన్ కల్యాణ్. మరోవైపు కార్మికుల ఆవేదనను ప్రభుత్వం అర్థంచేసుకోవాలని, సమ్మె ఉధృతం కాకముందే సమస్య పరిష్కరించాలని పవన్ కళ్యాణ్ తెలంగాణ ప్రభుత్వాన్ని కోరారు. ఆర్టీసీ డ్రైవర్ శ్రీనివాస్ రెడ్డి ఆత్మ బలిదానం తీవ్రంగా కలచివేస్తుందని కోరుకున్న తెలంగాణ వచ్చిన తరువాత కూడా ఇటువంటి సంఘటన చోటు చేసుకోవడం శోచనీయమని పవన్ కళ్యాణ్ ఆవేదన వ్యక్తం చేశారు. సమ్మెను వెంటనే పరిష్కరించి కార్మికుల్లో ధైర్యాన్ని నింపేలా సర్కార్ చర్యలు తీసుకోవాలని పవన్ కళ్యాణ్ కోరారు.

 

 

Tags:    

Similar News