ప్రగతి భవన్ ముట్టడికి జనసేన యత్నం
తెలంగాణలో ఇంటర్మీడియట్ ఫలితాల్లో అవకతవకలకు నిరసనగా జనసేన పార్టీ ముఖ్యమంత్రి కేసీఆర్ అధికారిక నివాసం ప్రగతి భవన్ ముట్టడించేందుకు ప్రయత్నించింది. జనసేన నేతలు ఇవాళ ఒక్కసారి ప్రగతి [more]
;
తెలంగాణలో ఇంటర్మీడియట్ ఫలితాల్లో అవకతవకలకు నిరసనగా జనసేన పార్టీ ముఖ్యమంత్రి కేసీఆర్ అధికారిక నివాసం ప్రగతి భవన్ ముట్టడించేందుకు ప్రయత్నించింది. జనసేన నేతలు ఇవాళ ఒక్కసారి ప్రగతి [more]
తెలంగాణలో ఇంటర్మీడియట్ ఫలితాల్లో అవకతవకలకు నిరసనగా జనసేన పార్టీ ముఖ్యమంత్రి కేసీఆర్ అధికారిక నివాసం ప్రగతి భవన్ ముట్టడించేందుకు ప్రయత్నించింది. జనసేన నేతలు ఇవాళ ఒక్కసారి ప్రగతి భవన్ వద్దకు చేరుకొని ఆందోళన చేసేందుకు ప్రయత్నించారు. వీరిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఇంటర్ విద్యార్థులకు ప్రభుత్వం న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. ఫలితాల్లో చోటుచేసుకున్న అవకతవకలపై న్యాయ విచారణ జరిపించాలని కోరారు.