జైలు నుంచి స్టేషన్ కు నేడు జేసీ
నేడు జేసీ ప్రభాకర్ రెడ్డి, అస్మిత్ రెడ్డిలను అనంతపురం పోలీసులు విచారించనున్నారు. కడప జిల్లా జైలులో ఉన్న వీరిద్దరినీ విచారణ కోసం పోలీసులు కస్టడీ పిటీషన్ వేశారు. [more]
నేడు జేసీ ప్రభాకర్ రెడ్డి, అస్మిత్ రెడ్డిలను అనంతపురం పోలీసులు విచారించనున్నారు. కడప జిల్లా జైలులో ఉన్న వీరిద్దరినీ విచారణ కోసం పోలీసులు కస్టడీ పిటీషన్ వేశారు. [more]
నేడు జేసీ ప్రభాకర్ రెడ్డి, అస్మిత్ రెడ్డిలను అనంతపురం పోలీసులు విచారించనున్నారు. కడప జిల్లా జైలులో ఉన్న వీరిద్దరినీ విచారణ కోసం పోలీసులు కస్టడీ పిటీషన్ వేశారు. వీరిని విచారించేందుకు న్యాయస్థానం అనుమతి ఇచ్చింది. రవాణా శాఖలో నకిలీ ధృవపత్రాలు, ఫోర్జరీ సంతకాలతో స్కామ్ కు పాల్పడ్డారని వీరిద్దరినీ పోలీసులు వారం రోజుల క్రితం అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. అయితే ఈ కుంభకోణంలో మరింత లోతుగా దర్యాప్తు చేయాలంటే వీరిని విచారించాల్సిన అవసరం ఉందని పోలీసులుపిటీషన్ వేశారు. వీరిద్దరినీ పోలీసులు నేడు విచారించనున్నారు.