నా ఆరోగ్య పరిస్థితి బాగుంది.. త్వరలోనే కోలుకుంటా

తాడిపత్రి మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డికి కరోనా వైరస్ సోకింది. ఆయన హైదరాబాద్ లోని కిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. తన ఆరోగ్య పరిస్థితి బాగుందని, [more]

Update: 2020-08-23 02:43 GMT

తాడిపత్రి మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డికి కరోనా వైరస్ సోకింది. ఆయన హైదరాబాద్ లోని కిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. తన ఆరోగ్య పరిస్థితి బాగుందని, త్వరలోనే కోలుకుని వస్తానని జేసీ ప్రభాకర్ రెడ్డి చెప్పారు. ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని జేసీ ప్రభాకర్ రెడ్డి చెప్పారు. కాగా జేసీ ప్రభాకర్ రెడ్డి ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులో కడప జిల్లా జైలులో రిమాండ్ ఖైదీ ఉండగా ఆయనకు కరోనా సోకింది. హైకోర్టు ఆయనకు బెయిల్ మంజూరు చేయడంతో హైదరాబాద్ లోని కిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.

Tags:    

Similar News