Kcr : కేంద్రంపై కేసీఆర్ యాక్షన్ ప్లాన్ ఇదే
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ మరోసారి కేంద్ర ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. తాను పోరాటం చేస్తానని, భయపడబోనని కేసీఆర్ తెలిపారు. బీజేపీ నేతలు తనను ఏమీ చేయలేరని, [more]
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ మరోసారి కేంద్ర ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. తాను పోరాటం చేస్తానని, భయపడబోనని కేసీఆర్ తెలిపారు. బీజేపీ నేతలు తనను ఏమీ చేయలేరని, [more]
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ మరోసారి కేంద్ర ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. తాను పోరాటం చేస్తానని, భయపడబోనని కేసీఆర్ తెలిపారు. బీజేపీ నేతలు తనను ఏమీ చేయలేరని, ఎటువంటి విచారణకైనా సిద్ధమని కేసీఆర్ తెలిపారు. ఈరోజు కూడా కేసీఆర్ మీడియా సమావేశంలో మాట్లాడారు. తెలంగాణలో పండించే ధాన్యం కొనుగోలు చేయాల్సిందేనని కేసీఆర్ తెలిపారు. వచ్చే శుక్రవారం అన్ని మండల కేంద్రాల్లో ధర్నాలు చేయనున్నట్లు కేసీఆర్ చెప్పారు.
ఎవరినీ వదిలిపెట్టబోం….
తనది ఫామ్ హౌస్ కాదని, ఫార్మర్ హౌస్ అని కేసీఆర్ తెలిపారు. ప్రశ్నించిన వాళ్లంతా దేశ ద్రోహులు ఎలా అవుతారని ఆయన అన్నారు. బీజేపీ నేతలను వదిలిపెట్టబోమని కేసీఆర్ తెలిపారు. త్వరలోనే తెలంగాణ వ్యాప్తంగా నోటిఫికేషన్ జారీ చేయనున్నట్లు కేసీఆర్ తెలిపారు. తమకు బాస్ తెలంగాణ ప్రజలే కాని, మరెవరూ కాదన్నారు. బండి సంజయ్ సొల్లు పురాణం చెప్పడం మానుకోవాలని కేసీఆర్ హితవు పలికారు. ప్రతి ఏడాది ఉద్యోగాల భర్తీ కోసం క్యాలెండర్ విడుదల చేస్తామని చెప్పారు. తెలంగాణలో పండే ప్రతి గింజా కొనాల్సిందేనని కేసీఆర్ డిమాండ్ చేశారు.