దిలీప్‌పై దర్శకుడు బాలచంద్రకుమార్ చేసిన తాజా ఆరోపణలపై దర్యాప్తు చేస్తున్న కొత్త బృందం ఈ దాడికి నాయకత్వం వహించింది. నటుడి నిర్మాణ సంస్థ 'గ్రాండ్ ప్రొడక్షన్స్' కార్యాలయం, అతని సోదరుడు అనూప్ ఇంటిపై కూడా దాడులు నిర్వహిస్తున్నారు. కోర్టు అనుమతితో 20 మంది సభ్యుల బృందం సోదాలు నిర్వహిస్తోంది. దిలీప్‌తో విభేదించిన బాలచంద్రకుమార్, లైంగిక వేధింపులకు గురైన నటి క్లిప్‌లు దిలీప్ తన వద్ద ఉంచుకున్నట్లు తెలిపాడని బాలచంద్రకుమార్ పోలీసులతో తెలిపారు. నటి అపహరణ కేసును విచారిస్తున్న కొంతమంది పోలీసు అధికారులపై స్వయంగా చర్యలు తీసుకుంటానని దిలీప్ బెదిరించాడని కుమార్ ఆరోపించారు.
రెండు వారాల క్రితం, బాలచంద్రకుమార్ ఒక టీవీ ఛానెల్‌తో మాట్లాడుతూ.. లైంగిక వేధింపుల విజువల్స్‌ను దిలీప్ వీక్షించాడని మరియు చిత్ర పరిశ్రమలో డ్రైవర్‌గా పనిచేసిన ప్రధాన నిందితుడు సునీల్ కుమార్ అలియాస్ పల్సర్ సునీతో అనుబంధం కొనసాగించాడని ఆరోపించారు. దిలీప్‌కు ఆపాదించబడిన ఆడియో క్లిప్‌లు కూడా మీడియాలో వచ్చాయి.. అందులో "ఐదుగురు దర్యాప్తు అధికారులు ఎలా బాధపడతారో వేచి ఉండండి" అని చెప్పడం వినిపించింది. ఆడియో క్లిప్‌లో ఉన్న మరో వ్యక్తి "బైజు పౌలోస్ ( కేసును విచారించిన అధికారి)ని ట్రక్కు ఢీకొంటే మరో రూ. 1.50 కోట్లు చూడవలసి ఉంటుంది" అని చెప్పడం వినిపించింది. దర్యాప్తు అధికారి, అతని బృందంలోని సభ్యులపై కుట్ర పన్నేందుకు దిలీప్ ప్రయత్నించాడని బాలచంద్రకుమార్ పోలీసులకు చెప్పారు. దిలీప్‌పై బాలచంద్రకుమార్ వెల్లడించిన వివరాల ఆధారంగా జనవరి 20న నివేదిక సమర్పించాలని కొచ్చిలోని ట్రయల్ కోర్టు గత వారం పోలీసులను ఆదేశించింది. నటి అపహరణ కేసును దర్యాప్తు చేస్తున్న పోలీసు బృందం నిందితుడిగా ఉన్న కొత్త కేసులో ముందస్తు బెయిల్ కోరుతూ దిలీప్ కోర్టును ఆశ్రయించారు. ఈ కేసు జనవరి 14న విచారణకు రానుంది.
నటి భావన ఇటీవల 2017లో కేరళలో తనను అపహరించి లైంగిక వేధింపులకు గురిచేసిన కేసు గురించి మాట్లాడారు. ఈ దాడి కేసులో నటుడు దిలీప్‌తో పాటు మరికొందరు సూత్రధారిగా ఉన్నారు.సినీ నటి భావనపై అయిదేళ్ల కిందట సామూహిక లైంగిక దాడి జరిగింది. 2017 ఫిబ్రవరి 17న ఆమెను కిడ్నాప్ చేసి కారులో రేప్ చేశారు. భావన త్రిసూర్ నుంచి కొచ్చికి ప్రయాణిస్తున్న సమయంలో రాత్రి పూట ఆమె ప్రయాణిస్తున్న కారును వ్యాన్‌తో ఢీ కొట్టిన దుండగులు... డ్రైవర్‌ను లాగేసి బలవంతంగా కారులోకి చొరబడ్డారు. ఆ తరువాత కారులో తిప్పుతూ సుమారు మూడు గంటలపాటు భావనపై వారు లైంగిక దాడి చేశారు. ఆ సమయంలో వీడియోలు, ఫొటోలు తీశారు. చివరకు కొచ్చిలోని ఒక ప్రాంతంలో ఆమెను వదిలేసి వెళ్లిపోయారు.
ఆమె తనపై జరిగిన దాడికి సంబంధించి సోషల్ మీడియాలో పోస్ట్ కూడా పెట్టారు. "ఇది అంత తేలికైన ప్రయాణం కాదని.. నిందితుడి నుండి ప్రాణాలతో బయటపడే ప్రయాణమని తెలిపారు. నా గొంతును సజీవంగా ఉంచడానికి ముందుకొచ్చిన కొందరు ఉన్నారు. న్యాయం కోసం జరిగే ఈ పోరాటంలో నేను ఒంటరిదాన్ని కాదని నాకు తెలుసు.. న్యాయం జరిగేలా చూడాలని, తప్పు చేసిన వారికి శిక్ష పడేలా చూడాలని, మరెవరికీ ఇలాంటి కష్టాలు రాకుండా చూడాలని, ఈ ప్రయాణం కొనసాగిస్తాను.. నాతో పాటు నిలబడిన వారందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు."