మరో మిలియన్ మార్చ్ తప్పేలా లేదు

ఆర్టీసీ సమ్మెపై కోర్టు చెప్పినా కేసీఆర్ ప్రభుత్వంలో కదలిక రాలేదని తెలంగాణ జనసమితి నేత కోదండరామ్ అన్నారు. ఆర్టీసీ కార్మికుల సమస్యలు పరిష్కారం అయ్యే వరకూ పోరాడతామన్నారు. [more]

Update: 2019-10-30 12:26 GMT

ఆర్టీసీ సమ్మెపై కోర్టు చెప్పినా కేసీఆర్ ప్రభుత్వంలో కదలిక రాలేదని తెలంగాణ జనసమితి నేత కోదండరామ్ అన్నారు. ఆర్టీసీ కార్మికుల సమస్యలు పరిష్కారం అయ్యే వరకూ పోరాడతామన్నారు. చర్చలకు పిలిచి ఆంక్షలు పెట్టారన్నారు. ఇప్పుడు సభకూడా పోలీసు ఆంక్షల మధ్యనే జరుగుతుందన్నారు. ఆర్టీసీ కార్మికులకు అండగా ప్రతి రాజకీయ పార్టీ ఉందన్నది గుర్తుంచుకోవాలన్నారు. యాభై వేల మంది ఆర్టీసీ కార్మికుల గొంతు కోస్తారా? అని ప్రశ్నించారు. ఎవరూ అధైర్య పడవద్దని, సమస్యలను ఖచ్చితంగా పరిష్కరించుకుంటామని, ఆత్మహత్యలకు పాల్పడొద్దన్నారు. ఖచ్చితంగా ఐక్యంగా విజయం సాధిస్తామని కోదండరామ్ తెలిపారు. ప్రగతి భవన్ లో కేసీఆర్ ఒంటరి అయిపోయారని, ఆయన వెనక మంత్రులు, ఎమ్మెల్యేలు కూడా లేరని కోదండరామ్ అన్నారు. కానీ ఆర్టీసీ కార్మికుల వెంట తెలంగాణ సమాజం మొత్తం ఉందని తెలిపారు.డిమాండ్లు సాధించేంతవరకూ పోరాడతామని, అవసరమైతే మిలియన్ మార్చ్ నిర్వహిస్తామని కోదండరామ్ తెలిపారు.

Tags:    

Similar News