మరో 8మంది జంప్ అయినట్లేనా?

కర్ణాకటలో కుమారస్వామి బలపరీక్ష నేటికి వాయిదా పడింది. ఈరోజు ఎట్టిపరిస్థితుల్లో సాయంత్రం 6గంటల్లోగా బలపరీక్ష జరుపుతానని స్పీకర్ రమేష్ కుమార్ ప్రకటించారు. అయితే సంకీర్ణ సర్కార్ మరో [more]

Update: 2019-07-23 02:59 GMT

కర్ణాకటలో కుమారస్వామి బలపరీక్ష నేటికి వాయిదా పడింది. ఈరోజు ఎట్టిపరిస్థితుల్లో సాయంత్రం 6గంటల్లోగా బలపరీక్ష జరుపుతానని స్పీకర్ రమేష్ కుమార్ ప్రకటించారు. అయితే సంకీర్ణ సర్కార్ మరో సంక్షోభంలో కూరుకుపోయింది. మరో ఎనిమిది మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు రాజీనామా చేయడానికి సిద్ధంగా ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. ఇప్పటికే 15 మంది కాంగ్రెస్, జేడీఎస్ ఎమ్మెల్యేలు రాజీనామా చేశారు. కాంగ్రెస్ పార్టీ విప్ జారీ చేయడంపైనా, రెబల్ ఎమ్మెల్యేలు తమ రాజీనామాలు ఆమోదించాలని సుప్రీంకోర్టును ఆశ్రయించిన సంగతి తెలిసిందే. ఈరోజు సుప్రీంకోర్టులో ఈ రెండింటిపైనా విచారణ జరగనుంది. సుప్రీంకోర్టు తీర్పు కోసం కాంగ్రెస్, జేడీఎస్ లు వేచి చూస్తున్నాయి. ఈరోజు కుమారస్వామి సర్కార్ భవితవ్యం తేలనుంది.

Tags:    

Similar News