లగడపాటి ఇలా ట్విస్ట్ ఇచ్చారేంటి?

తెలంగాణలో ఎన్నికల ఫలితాలపై మాజీ ఎంపీ లగడపాటి రాజగోపాల్ అనుమానాలు వ్యక్తం చేశారు. బుధవారం ఆయన ఢిల్లీలో మీడియాతో మాట్లాడుతూ… గత కొన్ని రోజులుగా తన వ్యక్తిత్వంపై [more]

Update: 2019-01-30 11:05 GMT

తెలంగాణలో ఎన్నికల ఫలితాలపై మాజీ ఎంపీ లగడపాటి రాజగోపాల్ అనుమానాలు వ్యక్తం చేశారు. బుధవారం ఆయన ఢిల్లీలో మీడియాతో మాట్లాడుతూ… గత కొన్ని రోజులుగా తన వ్యక్తిత్వంపై సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం జరుగుతున్నందున ఇప్పుడు మాట్లాడుతున్నానన్నారు. తెలంగాణలో డబ్బు ప్రభావం ఎక్కువ ఉంటుందని మందే చెప్పానని పేర్కొన్నారు. ఈ ఎలక్ట్రానిక్ యుగంలో పోలింగ్ ముగిసిన అరగంటలోనే పోలింగ్ శాతం ఎంతో తెలియాలని, కానీ పోలింగ్ శాతం చెప్పేందుకు 2 రోజులు ఎందుకు పట్టిందని ఆయన ప్రశ్నించారు. అసెంబ్లీ ఎన్నికల్లో ఏకపక్షంగా టీఆర్ఎస్ గెలిచినందున పంచాయితీ ఎన్నికల్లోనూ టీఆర్ఎస్ కే ఏకపక్షంగా ఫలితాలు రావాలని, ప్రతిపక్షం పూర్తిగా తుడిచిపెట్టుకొని పోవాలన్నారు. అయితే, అలా జరగకుండా పంచాయితీ ఎన్నికల్లో కాంగ్రెస్ కూడా ఎక్కువ స్థానాలే సాధిస్తుందన్నారు. ఈవీఎంలపై, ఓటింగ్ శాతంపై అనుమానాలు ఉన్నందున… అనుమానాలను నివృత్తి చేయాల్సిన బాధ్యత ఎన్నికల సంఘం, ప్రభుత్వంపై ఉందన్నారు.

ఏపీ ఎన్నికల ఫలితాలు ముందే చెప్పను

కేటీఆర్ విజ్ఞప్తి మేరకు నవంబర్ 11న తాను 37 స్థానాలకు సర్వే చేసి కేటీఆర్ కు రిపోర్టు పంపించినట్లు తెలిపారు. ఇందులో గోషామహాల్ లో బీజేపీ, రామగుండంలో ఇండిపెండెంట్ గెలుస్తారని వచ్చిందని చెప్పారు. టీఆర్ఎస్ కు 18, కాంగ్రెస్ కు 15 స్థానాలు వస్తాయని తేలిందన్నారు. వీటిల్లో కొడంగల్ లో రేవంత్ రెడ్డికి 7 శాతం మెజారిటీ, నాగార్జున సాగర్ లో జానారెడ్డికి 16 శాతం, కోదాడలో పద్మావతికి 17 శాతం మెజారిటీ వస్తుందనే తేలిందన్నారు. కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావుకు కూడా సుమారు 25 – 35 శాతం మెజారిటీ వస్తుందని సర్వే అంచనాలు వచ్చాయన్నారు. అయితే, టీఆర్ఎస్ అభ్యర్థుల మెజారిటీ అలానే ఉన్నా… కాంగ్రెస్ అభ్యర్థుల మెజారిటీ తగ్గిపోయి ఓడిపోయారన్నారు. తాను 15 ఏళ్లుగా సర్వేలు చేస్తున్నానని, ఎప్పుడూ తన సర్వేలు తప్పు కాలేదన్నారు. తాను ఎవరి ఒత్తిడికీ లొంగేవాడిని కానని, మాటపై నిలబడే వ్యక్తినన్నారు. వచ్చే ఎన్నికల్లో ముందుగా సర్వే ఫలితాలు చెప్పనన్నారు. ఎన్నికలు పూర్తయ్యాకే సర్వే వివరాలు చెబుతానని స్పష్టం చేశారు.

Tags:    

Similar News