1 September-టాప్ 10 లేటెస్ట్ తెలుగు న్యూస్

మహబూబాబాద్ జిల్లాలో రైల్వేట్రాక్ ధ్వంసం కావడంతో విజయవాడ-కాజీపేట మార్గంలో పలు రైళ్ల రాకపోకలు నిలిచిపోయాయి. రైల్వే ట్రాక్ లు కొన్ని చోట్ల దెబ్బతినడంతో పాటు ట్రాక్ పైకి నీళ్లు చేరడంతో రైళ్లు నిలిచి పోయినట్లు దక్షిణ మధ్య రైల్వే అధికారులు తెలిపారు. కొన్ని రైళ్లు ఆలస్యంగా నడుస్తున్నాయని అధికారులు తెలిపారు.

Update: 2024-09-01 12:51 GMT

(నోట్: పూర్తి వివరాలకు హెడ్లైన్ ని క్లిక్ చేయండి )

రెయిన్ ఎఫెక్ట్... నిలిచిపోయిన రైళ్లు

మహబూబాబాద్ జిల్లాలో రైల్వేట్రాక్ ధ్వంసం కావడంతో విజయవాడ-కాజీపేట మార్గంలో పలు రైళ్ల రాకపోకలు నిలిచిపోయాయి. రైల్వే ట్రాక్ లు కొన్ని చోట్ల దెబ్బతినడంతో పాటు ట్రాక్ పైకి నీళ్లు చేరడంతో రైళ్లు నిలిచి పోయినట్లు దక్షిణ మధ్య రైల్వే అధికారులు తెలిపారు. కొన్ని రైళ్లు ఆలస్యంగా నడుస్తున్నాయని అధికారులు తెలిపారు.

‌Hyderabad : రెయిన్ ఎఫెక్ట్... హైదరాబాద్‌లో వందల కోట్ల రూపాయలు న‌ష్టం

హైదరాబాద్ లో గత మూడు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు వ్యాపారాలు పూర్తిగా దెబ్బతిన్నాయి. కోట్ల రూపాయల మేరకు వ్యాపార లావాదేవీలు నిలిచిపోయాయి. ప్రజలు ఎవరూ దుకాణాలకు, మాల్స్ కు రాకపోతుండటంతో అవి వెలవెల పోతున్నాయి. కొనుగోలు దారులు లేక షాపుల్లోని సిబ్బంది గోళ్లు గిల్లుకుంటున్నారు.

Pawan Kalyan : పవన్ ఢిల్లీ ఎందుకు వెళ్లడం లేదు? అసలు రీజన్ అదేనా?

జనసేన అధినేత, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ వ్యవహారశైలిపై పార్టీలో పెద్దయెత్తున చర్చ జరుగుతుంది. గెలవక ముందు ఆయన వేరు. అధికారంలోకి వచ్చి డిప్యూటీ సీఎంగా బాధ్యతలను చేపట్టిన తర్వాత మరొక పవన్ ను పార్టీ నేతలు చూస్తున్నారు. దూకుడు తగ్గించారు. సౌమ్యంగా ఉంటున్నారు.

Rain Alert : తీరం దాటిన వాయుగుండం.. అయినా తప్పని ముప్పు

రెండు తెలుగు రాష్ట్రాలను భారీ వర్షాలు ముంచెత్తుతున్నాయి. బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం ప్రభావంతో మరో రెండు రోజుల పాటు భారీ వర్షాలు ఉంటాయని వాతావరణ శాఖ తెలిపింది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణలలో అనేక ప్రాంతాల్లో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ హెచ్చరంచింది.

Telangana Congress : ముఖ్యమంత్రి మారతారా? ఉత్తమ్ సీఎం అవుతారా? అసలు పార్టీలో ఎందుకు ఈ చర్చ మొదలయింది?

కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వస్తే ముఖ్యమంత్రి పదవి కోసం అనేక మంది ప్రయత్నిస్తుంటారు. పార్టీలో సీనియర్ నేతల దగ్గర నుంచి సామాజికవర్గాల వారీగా లీడర్లు ఢిల్లీలో లాబీయింగ్ ఉపయోగించి ఒక్కసారైనా ముఖ్యమంత్రి పదవి చేపట్టాలని అనుకుంటారు. అది సహజం. ప్రాంతీయ పార్టీల్లో ముఖ్యమంత్రి పదవి ఆశించడం కుదరదు.

Vande Bharath Trains : వందేభారత్ రైలు ప్రయాణికులకు గుడ్ న్యూస్

వందేభారత్ రైలు ప్రయాణికులకు రైల్వే శాఖ గుడ్ న్యూస్ చెప్పింది. మూడు నెలల్లో వందే భారత్ స్లీపర్ రైళ్లను ప్రవేశపెట్టనున్నట్లు తెలిపింది. ఈ మేరకు కేంద్ర రైల్వేశాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ తెలిపారు. బెంగళూరులోని భారత్ ఎర్త్ మూవర్స్ లిమిటెడ్ ఫెసిలిటీలో స్లీపర్ కోచ్ ప్రోటో టైప్ వెర్షన్ ను అశ్వినీ వైష్ణవ్ ఆవిష‌్కరించారు.

రేపు పాఠశాలలకు సెలవు ప్రకటించండి : చంద్రబాబు

ఆంధ్రప్రదేశ్ లో రేపు విద్యాసంస్థలకు సెలవులు ప్రకటించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు అధికారులను ఆదేశించారు. రేపు కూడా వర్షాలు కురిసే అవకాశముందని వాతావరణ శాఖ చేసిన హెచ్చరికతో పాఠశాలలకు సెలవులు ప్రకటించాలని ఆయన అధికారులతో జరిగిన సమీక్షలో తెలిపారు. ఇప్పటికే రాష్ట్రంలో వర్షాలు వరదల్లో తొమ్మిది మంది చనిపోవడం బాధాకరమని చంద్రబాబు అన్నారు.

Telangana : కారులో డెడ్ బాడీ..వరద నీటిలో

భారీ వర్షాలతో అనేక మంది ప్రాణాలు కోల్పోతున్నారు. ఇంటికి వెళ్లాలన్న తపనతో వాగులను తమ వాహనాలతో దాటిస్తూ ప్రమాదానికి లోనవుతున్నారు. కొందరు తెలిసీ తెలియక వాహనాలను వాగుల్లో దించుతుండగా, మరికొందరు ధైర్యంతో గమ్యం స్థానం వెళ్లాలని వాగులు దాటుతూ మృత్యువాత పడుతున్నారు.

అధికారులకు సెలవులు రద్దు

అధికారులకు సెలవులను రద్దు చేస్తూ తెలంగాణ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు అన్ని శాఖల అధికారులు ఎవరూ సెలవు తీసుకోవద్దని కోరింది. అత్యవసర సేవలను అందించడానికి అందుబాటులో ఉండాలని సూచించింది. ప్రధానంగా జీహెచ్ఎంసీ, రెవెన్యూ, వైద్య శాఖ ఉన్నతాధికారుల నుంచి సిబ్బంది వరకూ పనిచేయాలని కోరారు.

Vijayawada : విజయవాడలో రికార్డు స్థాయి వర్షం

విజయవాడలో రికార్డ్‌ స్థాయిలో వర్షం కురిసింది. ముప్ఫయి ఏళ్ల రికార్డ్‌ను బద్దలు చేసింది. చరిత్రలో ఎన్నడూ లేనంతగా ఒకేరోజు 29 సెంటిమీటర్ల వర్షపాతం నమోదు కాలేదని ప్రజలు చెబుతున్నారు. గత రెండు రోజులు విజయవాడలో కుండపోత. అనేక కాలనీల్లో నాలుగు అడుగుల మేర వరద నీరు నిలిచిపోయింది.

Tags:    

Similar News