టాప్ 10 లేటెస్ట్ తెలుగు న్యూస్

మహిళా రైతులకు కేంద్రం శుభవార్త.. సంక్రాంతి బరిలో వెంకీ, నాగ్, యశస్వీ.. దంచవయ్యా .. దంచూ

Update: 2024-01-11 12:45 GMT

(నోట్: పూర్తి వివరాలకు హెడ్లైన్ ని క్లిక్ చేయండి )

PM Kisan: మహిళా రైతులకు కేంద్రం శుభవార్త.. పీఎం కిసాన్‌ సాయం రెట్టింపు?

కేంద్రంలోని మోడీ సర్కార్‌ రైతుల కోసం ఎన్నో పథకాలను అమలు చేస్తోంది. కేంద్ర ప్రభుత్వం రైతులకు అమలు చేస్తున్న పథకాల్లో పీఎం కిసాన్‌ సమ్మాన్‌ నిధి యోజన పథకం ఒకటి. ఇందులో ప్రస్తుతం రైతులకు ఏడాదికి రూ.6000 చొప్పున అందిస్తోంది. ఈ మొత్తం ఒకే సారి కాకుండా మూడు విడతల్లో రూ.2000 చొప్పున రైతుల ఖాతాల్లో జమ చేస్తోంది కేంద్రం. ఇప్పుడు పార్లమెంట్‌ ఎన్నికలు రానున్నాయి.

Andhra Pradesh : ఏపీలో వందేళ్లు దాటిన వాళ్లు ఇంత మంది ఉన్నారా? నిజంగా ఆశ్చర్యమే

నేటి పరిస్థితుల్లో వందేళ్లు జీవించడమంటే సామాన్య విష‍యం కాదు. నేటి జీవనశైలి, ఆహారపు అలవాట్లు, పెరిగిన నాగరికత వంటి కారణాలతో ఎనభై ఏళ్లకే ఎక్కువ మంది తనువులు చాలిస్తున్నారు. కల్తీ ఆహారం కూడా ప్రాణాలను త్వరగా తీసుకెళుతుంది. పాలు కల్తీ.. ధాన్యం కల్తీ...పప్పులు.. ఉప్పులు.. కూరగాయలు.. ఇలా ఒక్కటేమిటి.. అన్నీ కల్తీనే


NIA : ఎన్ఐఏ సోదాలు .. కలకలం

దేశ వ్యాప్తంగా ఎన్ఐఏ సోదాలు జరుగుతున్నాయి. దేశ వ్యాప్తంగా 32 ప్రాంతాల్లో నేషనల్ ఇన్విస్టిగేషన్ ఏజెన్సీ అధికారులు దాడులు నిర్వహిస్తున్నారు. ఢిల్లీ, హర్యానాతో పాటు పంజాబ్ రాష్ట్రంలోనూ ఈ తనిఖీలు జరుగుతున్నాయి. దీంతో దేశ వ్యాప్తంగా జరుగుతున్న ఎన్ఐఏ సోదాలతో కలకలం రేగుతుంది.


Nag-Venky: సంక్రాంతి బరిలో వెంకీ, నాగ్ ఎన్నిసార్లు విజయం సాధించారు..?

ఈ సంక్రాంతికి నాగార్జున ‘నా సామిరంగ’, వెంకటేష్ ‘సైంధవ్‌’ సినిమాలతో ఆడియన్స్ ముందుకు రాబోతున్నారు. ఈ పండగ భారీలో మహేష్ బాబు, తేజ సజ్జ సినిమాలు కూడా ఉన్నాయి. మరి ఈ పోటీలో ఎవరు గెలుస్తారు. అసలు వెంకటేష్, నాగార్జున ఇప్పటివరకు ఎన్నిసార్లు పండగ బరిలో నిలిచారు..? ఎన్నిసార్లు విజయం సాధించారు..?


Telangana : రెండింటికీ విడివిడిగా నోటిఫికేషన్

తెలంగాణలో రెండు ఎమ్మెల్సీ ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదలయింది. రెండు పదవులకు వేర్వేరుగా రెండు నోటిఫికేషన్లు విడుదల చేసింది. ఈనెల 18 వతేదీ వరకూ నామినేషన్లను స్వీకరిస్తారు. నేటి నుంచే నామినేషన్ల స్వీకరణ కార్యక్రమం ప్రారంభం కానుంది. 19వ తేదీన నామినేషన్లను పరిశీలిస్తారు. 22వ తేదీ వరకూ నామినేషన్ల ఉపసంహరణకు గడువు ఇచ్చారు. 29న పోలింగ్ జరగనుంది.

BRS : ఓటమి తర్వాత పెదవి విప్పుతున్న నేతలు.. అధినాయకత్వంలో అంతర్మధనం

భారత రాష్ట్ర సమితి ఇటీవల ఎన్నికల్లో ఓటమి పాలు కావడానికి అనేక కారణాలున్నాయి. పదేళ్లు అధికారంలో ఉండటంతో పాటు ప్రభుత్వం చేసిన తప్పులు కూడా ఉండే ఉంటాయి. దీనికి తోడు పార్టీ అధినేత ఎవరికీ అందుబాటులో ఉండకపోవడం కూడా కిందిస్థాయి క్యాడర్ లో కొంత అసహనం ఏర్పడింది

లక్షద్వీప్‌ కు ఎలా వెళ్లాలంటే?

భారతదేశంలోని కేంద్రపాలిత ప్రాంతమైన లక్షద్వీప్‌ కు వాయు మార్గం, జలమార్గంలో వెళ్లొచ్చు. కేరళ తీరానికి సుమారు 300 కి.మీ. దూరంలో లక్షద్వీప్ ఉంటుంది. ఈ దీవులకు వెళ్లాలంటే ముందుగా కేరళలోని కొచ్చి ప్రాంతానికి చేరుకోవాలి. కొచ్చి నుంచి ఓడలు, బోట్లు, విమానాలు, హెలికాప్టర్లలో లక్షద్వీప్‌ చేరుకోవచ్చు.

Afghanistan : ఆప్ఘనిస్థాన్ లో భూకంపం.. తీవ్రత ఎంతంటే?

ఆప్ఘనిస్థాన్ లో భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేల్ పై 6.1 తీవ్రతగా నమోదయింది. ఈరోజు మధ్యాహ్నం మూడు గంటల ప్రాంతంలో భూకంపం సంభవించినట్లు ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. భూకంప తీవ్రతకు భయాందోళనలకు గురైన ప్రజలు బయటకు పరుగులు తీశారు.

Yashaswi Jaishwal : యశస్వీ.. దంచవయ్యా .. దంచూ

నేడు ఇండియా - ఆప్ఘనిస్తాన్ తొలి టీ 20 మ్యాచ్ జరగనుంది. ఈ మ్యాచ్ మరికాసేపట్లో మొహాలీ వేదికగా ప్రారంభం కానుంది. అయితే అందరి చూపు యశస్వి పైనే ఉంది. మొహాలీ పిచ్ బ్యాటింగ్ కు అనుకూలం కావడంతో యశస్వి జైశ్వాల్ పై ఫ్యాన్స్ ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. ఓపెనర్ గా దిగనున్న యశస్వి వీర బాదుడు బాదితేనే భారత్ ఎక్కువ స్కోరు నమోదు చేయగలుగుతుంది. యశస్వి దూకూడు గానే ఆడతాడు. స్ట్రోక్స్ కూడా బలంగానే ఉంటాయి. సిక్సర్లు, ఫోర్లు దంచి కొడతాడు.


పందాలకు రెడీ అవుతున్న కోళ్లు.. మిలటరీ స్థాయిలో శిక్షణ.. ఖర్చు ఎంతో తెలిస్తే షాకవుతారు!

సంక్రాంతి పండగ వచ్చిందంటే చాలా మందికి గుర్తుకు వచ్చేది కోడి పందాలు. భోగి మంటలు, ముత్యాల ముగ్గులు, డుడూ బసవన్నలు, ఆటలు, హరిదాసు కీర్తనలు. వీటన్నింటి మధ్యలో ఆట విడుపుగా కోడి పందేలు. పల్లెల్లో కోడి పందేల సందడి అంతా ఇంతా కాదండోయ్‌.


Tags:    

Similar News