2 September-టాప్ 10 లేటెస్ట్ తెలుగు న్యూస్

భారీ వర్షాలతో హుస్సేన్ సాగర్ లో నీరు ఫుల్లుగా ఉంది. గతంలో ఎన్నడూ లేని విధంగా హుస్సేన్ సాగర్ లో నీరు చేరడంతో ప్రమాదకర పరిస్థితుల్లో ఉంది. బంజారాహిల్స్, పికెట్‌, కూకట్‌పల్లి నాలాలతోపాటు ఎగువ ప్రాంతాల నుంచి వరద పోటెత్తడంతో సాగర్‌కు భారీగా వరద నీరు చేరుతుందని అధికారులు తెలిపారు.

Update: 2024-09-02 12:06 GMT

(నోట్: పూర్తి వివరాలకు హెడ్లైన్ ని క్లిక్ చేయండి )

ఫుల్లయిన హుస్సేన్ సాగర్.. డేంజరస్ లెవెల్

భారీ వర్షాలతో హుస్సేన్ సాగర్ లో నీరు ఫుల్లుగా ఉంది. గతంలో ఎన్నడూ లేని విధంగా హుస్సేన్ సాగర్ లో నీరు చేరడంతో ప్రమాదకర పరిస్థితుల్లో ఉంది. బంజారాహిల్స్, పికెట్‌, కూకట్‌పల్లి నాలాలతోపాటు ఎగువ ప్రాంతాల నుంచి వరద పోటెత్తడంతో సాగర్‌కు భారీగా వరద నీరు చేరుతుందని అధికారులు తెలిపారు.

YSRCP : వైసీపీ వాయిస్ ఒక్కటే.. మిగిలిన గొంతులన్నీ మూగబోయాయిగా?

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికారం కోల్పోయిన తర్వాత లీడర్ల గొంతులు మూగబోయాయి. కనీసం పార్టీ తరుపున మాట్లాడేందుకు నేత కూడా లేరు. గతంలో అధికారంలో ఉన్నప్పుడు మంత్రులు, అధికార ప్రతినిధులు, ప్రత్యేక సలహాదారులు ఇలా మూకుమ్మడిగా చుట్టుముట్టేవారు.

‌Hydra : హైడ్రా అందుకే కావాలనింది బాబూ.. విమర్శకులూ ఇకనైనా నోరు మూయండి ప్లీజ్

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హైడ్రా ఏర్పాటు చేస్తే కొందరు హేళన చేశారు. మరికొందరు విమర్శలకు దిగారు. ఇది ఎంత కాలంలే అని సన్నాయి నొక్కులు నొక్కారు. బెదిరించడానికి చేస్తున్న పని అని కొందరు పనికి మాలిన మాటలు మాట్లాడారు. మరికొందరయితే విపక్షాలను అణిచి వేయడానికే హైడ్రాను రేవంత్ రెడ్డి తెచ్చారంటూ విమర్శలు చేశారు.

Chandrababu : చంద్రబాబును చూసి ఈ తరం పొలిటికల్ లీడర్స్ నేర్చుకోవాల్సిందే?

అవును.. ఇది నిజం.. ఏడు పదులు వయసు దాటినా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రజల్లోకి వెళ్లేందుకు ఏమాత్రం జంకరు. జనాలు కష్టాల్లో ఉంటే చాలు ఆయన రేయింబవళ్లూ పనిచేస్తారు. ఆయనకు తెలిసిన క్రైసిస్ మేనేజ్‌మెంట్ మెరెవరకీ తెలియదు. ముఖ్యమంత్రి అంటే క్యాంప్ కార్యాలయానికే పరిమితయితే సరికాదు.

Vijayawada : అర్థరాత్రి వరకూ విజయవాడకు గండమేనట....?

ఈరోజు అర్థరాత్రి వరకూ విజయవాడ ముప్పు పొంచి ఉందని చెబుతున్నారు. అమావాస్య కావడంతో కృష్ణా నదిలో నీరును సముద్రం తీసుకోదు. వెనక్కు తంతుంది. ఈరోజు అమావాస్య కావడంతో సముద్రంలో ఆటుపోట్లు ఉంటాయి. పోటు మీదున్న సముద్రం వరద నీటిని తాను తీసుకునే పరిస్థితి ఉండదు.

Telangana : మరో ఐదు రోజుల పాటు వర్షాలేనట

తెలంగాణలో మరో ఐదు రోజుల పాటు వర్షాలు పడతాయని వాతావరణ శాఖ తెలిపింది. ఈరోజు రాష్ట్రంలో అనేక చోట్ల భారీ వర్షాలు కురిస అవకాశముందని తెలిపింది. హైదరాబాద్ లో భారీ వర్షం కురిసే ఛాన్స్ ఉందని పేర్కొంది. తెలంగాణకు ఎల్లో అలెర్ట్ ను వాతావరణ శాఖ జారీ చేసింది. కొన్ని జిల్లాలకు రెడ్ అలెర్ట్ జారీ చేసిన అధికారులు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది.

వైఎస్ ఘాట్ వద్ద జగన్

వైసీపీ అధినేత వైఎస్ జగన్ కొద్ది సేపటి క్రితం ఇడుపుల పాయలోని వైఎస్సార్ ఘాట్ వద్ద నివాళులర్పించారు. ఈరోజు వైఎస్ రాజశేఖర్ రెడ్డి పదిహేనో వర్ధంతి కావడంతో ఆయన కుటుంబ సభ్యులతో కలసి ఇడుపులపాయలోని ఆయన సమాధి వద్ద నివాళులర్పించారు. కుటుంబ సభ్యులతో కలసి ప్రత్యేక ప్రార్ధనలను నిర్వహించారు.

Breaking : విజయవాడ - హైదరాబాద్ జాతీయ రహదారి బంద్

విజయవాడ - హైదరాబాద్ జాతీయ రహదారిపై రాకపోకలు నిలిచిపోయాయి. వాహనాలు కిలోమీటర్ల మేరకు నిలిచిపోయాయి. ఎన్టీఆర్ జిల్లా గరికపాడు వద్ద పాలేరు బ్రిడ్జిపై వరద నీరు ప్రవహిస్తుండటంతో వాహనాలు అటు నుంచి ఇటు ఇటు నుంచి అటు వెళ్లడం లేదు. వర్షం దెబ్బకు గరికపాడు వద్ద వంతెన దెబ్బతినింది.

హై అలెర్ట్...ఏపీకి మరో తుఫాను ముప్పు

ఆంధ్రప్రదేశ్ కు మరో తుఫాన్ ముప్పు ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఇప్పటికే వాయుగుండం ప్రభావంతో ఏపీలో భారీగా వర్షాలు కురుస్తున్నాయి. ప్రజలు అన్ని రకాలుగా ఇబ్బందులు పడుతున్నాయి. రాకపోకలు స్థంభించిపోయాయి. రవాణా వ్యవస్థ ఎక్కడికక్కడ నిలిచిపోయింది. రైళ్లు, బస్సులు లేక వేరే ప్రాంతాల్లో ఇరుక్కుపోయారు అనేక మంది.

Hyderabad : ఈరోజు కూడా ఇంట్లోనే ఉండండి.. హైదారాబాదీలకు రెడ్ అలెర్ట్

ఈరోజు కూడా హైదరాబాద్ లో భారీ వర్షం పడనుంది. అధికారులు రెడ్ అలెర్ట్ ప్రకటించారు. గత మూడు రోజల నుంచి ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తూనే ఉంది. బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం కారణంగా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. జీహెచ్ఎంసీ కమిషనర్ ఆమ్రపాలి ప్రత్యేకంగా ప్రజలకు వివరించారు.


Tags:    

Similar News