21August-టాప్ 10 లేటెస్ట్ తెలుగు న్యూస్
విమాన ప్రయాణికులకు నేటి నుంచి మంకీపాక్స్ పరీక్షలు అన్ని అంతర్జాతీయ విమానాశ్రయాల్ల నిర్వహించనున్నారు. మంకీపాక్స్ ఆఫ్రికా దేశాల్లో వేగంగా వ్యాపిస్తోంది. భారత్‌లోకి రాకుండా కట్టడికి కేంద్రప్రభుత్వం పలు ముందస్తు చర్యలు తీసుకుంటూ అన్ని రాష్ట్రాలకు కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే మార్గదర్శకాలను విడుదల చేసింది.
(నోట్: పూర్తి వివరాలకు హెడ్లైన్ ని క్లిక్ చేయండి )
నేటి నుంచి ఎయిర్‌పోర్టుల్లో మంకీపాక్స్ పరీక్షలు
విమాన ప్రయాణికులకు నేటి నుంచి మంకీపాక్స్ పరీక్షలు అన్ని అంతర్జాతీయ విమానాశ్రయాల్ల నిర్వహించనున్నారు. మంకీపాక్స్ ఆఫ్రికా దేశాల్లో వేగంగా వ్యాపిస్తోంది. భారత్‌లోకి రాకుండా కట్టడికి కేంద్రప్రభుత్వం పలు ముందస్తు చర్యలు తీసుకుంటూ అన్ని రాష్ట్రాలకు కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే మార్గదర్శకాలను విడుదల చేసింది.
CBI : సీబీఐ ఎంట్రీకి అనుమతి అందుకేనా? జగన్ చుట్టూ ఉచ్చు బిగించటానికేనా?
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. సీబీఐ విచారణకు నేరుగా ఏపీలో అనుమతిస్తూ ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. ఈ మేరకు గెజిట్ జారీ చేసింది. కేంద్ర ప్రభుత్వ సంస్థలు, ఉద్యోగులు, ప్రయివేటు సంస్థలు వంటి వాటిపై ఏదైనా ఫిర్యాదు వస్తే సీబీఐ నేరుగా విచారణ చేపట్టేందుకు అవకాశమిచ్చింది.
Free Bus for Women : మహిళలకు ఫ్రీ బస్సు పథకాన్ని హడావిడిగా అమలు చేస్తే అభాసుపాలు కావడమే
మహిళలకు ఉచిత బస్సు ప్రయాణాన్ని అమలు చేయాలంటే ఆషామాఫీ కాదు. ముందుగా అన్ని చర్యలు తీసుకోవాలి. ఆ చర్యలు తీసుకున్న తర్వాతనే ఉచిత బస్సు ప్రయాణాన్ని అమలు చేయాలి. లేకుంటే మాత్రం ప్రభుత్వం ప్రజల నుంచి వ్యతిరేకత ఎదుర్కొనాల్సి వస్తుంది. ఉచిత బస్సు ప్రయాణం హడావిడిగా అమలుచేయడం వల్ల లాభం కంటే నష్టమే ఎక్కువని ఆర్టీసీ ఉన్నతాధికారులు అభిప్రాయపడుతున్నారు.
KTR : ఆ ఫాం హౌస్ నాది కాదు
రైతుల కోసం రణానికైనా సిద్ధమని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. తమది భారత రాష్ట్ర సమితి మాత్రమే భారత రైతు సమితి అని ఆయన అన్నారు. రాష్ట్రంలో రుణమాఫీ పూర్తిగా జరగలేదన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా అనేకచోట్ల రైతులు ఆందోళనలకు దిగుతున్నారన్నారు. రుణమాఫీ ఆందోళలను పక్కదారి పట్టించే ప్రయత్నంచేస్తున్నారన్నారు.
Galla Jayadev : గల్లా అనవసరంగా రాజకీయాల నుంచి తప్పుకున్నారా? ఇప్పుడు రియలైజ్ అయ్యారా?
గల్లా జయదేవ్ రాజకీయాలకు బ్రేక్ ఇచ్చి తప్పు చేశారా? ఆయన ఉన్న నియోజకవర్గాన్ని కాలదన్నుకుని వెళ్లిపోవడంతో రాజకీయంగా దెబ్బితిన్నారా? అంటే అవుననే అనాల్సి వస్తుంది. గెలిచే టైం లో రాంగ్ డెసిషన్ తీసుకుని గల్లా జయదేవ్ రాజకీయాలకు బ్రేక్ ఇస్తున్నానని ప్రకటించడం ఆయన రాజకీయ జీవితానికి ఫుల్‌స్టాప్ పడినట్లయింది.
BJP : ఏపీలో బీజేపీ మరింత బలోపేతానికి కృషి
భారతీయ జనతా పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ పాల్గొనాలని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు పురంద్రీశ్వరి కోరారు. బీజేపీ గెలవని రాష్ట్రాల్లోనూ పార్టీ బలోపేతానికి పార్టీ అగ్రనాయకత్వం కృషి చేస్తుందని తెలిపారు. ఈరోజు సభ్యత్వ నమోదు కార్యక్రమంపై జరిగిన సమావేశంలో ఆమె ప్రసంగించారు.
అనంతపురం జిల్లాలో రోడ్డు ప్రమాదం.. ముగ్గురి మృతి
అనంతపురం జిల్లా తాడిపత్రి నియోజకవర్గంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ముగ్గురు మరణించారు. తాడిపత్రి నియోజకవర్గంలోని బొందలదిన్నె గ్రామ సమీపంలో లారీ - కారు ఢీకొన్నాయి. బెదరగుట్టపల్లి గ్రామానికి చెందిన ప్రతాప్ రెడ్డి, వెంకటలక్ష్మి, ప్రమీల ఒక బంధువుల ఇంట్లో వేడుక కోసం కడప జిల్లా వేంపల్లి గ్రామానికి వెళ్లారు.
కోల్‌కత్తా ఘటన.. ముగ్గురు పోలీసు అధికారులపై వేటు
కోల్‌కత్తాలో జూనియర్ వైద్యురాలిపై అత్యాచార ఘటన అనంతరం ఆర్‌జీ కార్ ఆసుపత్రిలో బుధవారం రాత్రి దుండగులు సృష్టించిన విధ్వంసంపై ప్రభుత్వం సీరియస్ అయింది. ఈ సమయంలో ముగ్గురు పోలీసు అధికారులపై సస్పెన్షన్ వేటు వేసింది. విధుల్లో ఉన్న ఈ ముగ్గురు అధికారులను సస్పెండ్ చేస్తూ కోల్‌కత్తా పోలీసు ఉన్నతాధికారులు ఈ నిర్ణయం తీసుకున్నారు.
Ys Jagan : బ్రిటన్ వెళ్లేందుకు అనుమతి కోరిన వైఎస్ జగన్
బ్రిటన్ వెళ్లేందుకు తనకు అనుమతివ్వాలని మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సీబీఐ కోర్టులో పిటీషన్ దాఖలు చేశారు. యూకేలో చదువుతున్న తన కుమార్తె వద్దకు సెప్టంబరు మొదటి వారంలో వెళ్లేందుకు అనుమతించాలని ఆయన సీబీఐ కోర్టులో పిటీషన్ వేశారు. అయితే ఈ విచారణను నేటికి వాయిదా వేశారు.
నేడు తిరుమలకు చిరంజీవి
మెగాస్టార్ చిరంజీవి నేడు తిరుమలకు చేరుకోనున్నారు. రేపు చిరంజీవి పుట్టిన రోజు కావడంతో శ్రీవారిని దర్శించుకునేందుకు ఆయన నేటి రాత్రికి తిరుమలకు చేరుకుంటున్నారు. కుటుంబ సభ్యులతో కలసి చిరంజీవి తిరుమలకు వస్తున్నారు. రేపు పుట్టిన రోజు సందర్భంగా కుటుంబ సభ్యులతో కలసి స్వామి వారిని దర్శించుకుంటారు.