23August-టాప్ 10 లేటెస్ట్ తెలుగు న్యూస్
ఒడిశా రాష్ట్రంలో బంగారు గని ఉన్నట్లు నిర్ధారణ అయింది. ఈ మేరకు ఉక్కు గనుల శాఖ మంత్రి బిభూతి భూషన్ జెనా తెలిపారు. బంగారు గని ఉన్నట్లు కనుగొన్నట్లు ఆన తెలిపారు. సర్వేలో ఈ విషయం వెల్లడయిందని గనుల శాఖ మంత్రి తెలిపారు. ఈ గనిలో పెద్దయెత్తున బంగారు నిల్వలు ఉండే అవకాశముందని చెప్పారు.
(నోట్: పూర్తి వివరాలకు హెడ్లైన్ ని క్లిక్ చేయండి )
ఆ రాష్ట్రంలో బంగారు గని
ఒడిశా రాష్ట్రంలో బంగారు గని ఉన్నట్లు నిర్ధారణ అయింది. ఈ మేరకు ఉక్కు గనుల శాఖ మంత్రి బిభూతి భూషన్ జెనా తెలిపారు. బంగారు గని ఉన్నట్లు కనుగొన్నట్లు ఆన తెలిపారు. సర్వేలో ఈ విషయం వెల్లడయిందని గనుల శాఖ మంత్రి తెలిపారు. ఈ గనిలో పెద్దయెత్తున బంగారు నిల్వలు ఉండే అవకాశముందని చెప్పారు.
Duvvada Srinivas : దువ్వాడకు షాకిచ్చిన జగన్.. టెక్కలి ఇన్‌ఛార్జి పదవి నుంచి తొలిగింపు
గత కొద్ది రోజులుగా వైసీపీ ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ కుటుంబ వ్యవహారం వీధికెక్కింది. కుటుంబ కలహాలతో దువ్వాడ శ్రీనివాస్ పార్టీ పరువు ప్రతిష్టలను దిగజార్చారన్న అభిప్రాయం వైసీపీ నేతల్లో ఉంది. దువ్వాడ ఎఫెక్ట్ ఉత్తరాంధ్ర మొత్తం మీద పడుతుందని ఆ ప్రాంత ఫ్యాన్ పార్టీ నేతలు ఆందోళన చెందారు.
Andhra Pradesh : బీసీలకు గుడ్ న్యూస్ చెప్పనున్న ఏపీ సర్కార్
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం బీసీలకు గుడ్ న్యూస్ చెప్పింది. వడ్డీ లేకుండా మూడు లక్షల రూపాయల రుణాలను అందించేందుకు సిద్ధమయింది. కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే అమలు చేస్తున్న ప్రధాని విశ్వకర్మ యోజన పథకాన్ని ఆదరణ స్కీమ్ తో కలపాలని నిర్ణయించింది. చేతివృత్తుల పనివారలకు ఊతమందించేందుకు కేంద్ర ప్రభుత్వం విశ్వకర్మ యోజన పథకాన్ని అమలులోకి తెచ్చారు.
Kamala Harris : కమలా హారిస్ దూకుడుకు ట్రంప్ గ్రాఫ్ పడిపోతుందా?
అమెరికా అధ్యక్ష ఎన్నికల ప్రక్రియ ఉత్కంఠ భరితంగా సాగుతుంది. బైడన్ బరి నుంచి తప్పుకుని కమలాహారిస్ ను డెమొక్రటిక్ పార్టీ అభ్యర్థిగా ప్రకటించడంతో పోటీ తీవ్రంగా ఉంది. బైడెన్ బరిలో ఉన్నంత వరకూ ట్రంప్ వైపు మొగ్గు చూపిన అమెరికన్లు కమలా హారిస్ రాకతో పోటీ టైట్ గా మారింది.
Breaking : నేపాల్ లో ఘోర రోడ్డు ప్రమాదం.. బస్సులో 40 మంది భారతీయులు
నేపాల్ లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. అదుపుతప్పి బస్సు లోయలో పడింది. పొఖరా నుంచి ఖాట్మండు వెళుతుండగా ఈ బస్సు లోయలో పడింది. అయితే ఈ బస్సులో నలభై మంది భారతీయులున్నట్లు చెబుతున్నారు. అయితే వీరిలో చాలా మంది గల్లంతయినట్లు అందుతున్న సమాచారాన్ని బట్టి తెలుస్తోంది.
ఉక్రెయిన్ చేరుకున్న ప్రధాని నరేంద్ర మోదీ
భారత ప్రధాని నరేంద్ర మోదీ పోలాండ్ పర్యటన ముగిసింది. తర్వాత ప్రధాని నరేంద్ర మోదీ పది గంటల పాటు సుదీర్ఘ రైలు ప్రయాణం చేసి ఉక్రెయిన్ కు చేరుకున్నారు. మోదీ ప్రయాణిస్తున్న ప్రత్యేక రైలు కీవ్ నగరానికి చేరుకుంది. ఏడు గంటలపాటు ఆయన పర్యటన సాగనుంది. ఈ పర్యటనలో ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్ స్కీ తో మోదీ సమావేశమవుతారు.
Anil Ambani : అనిల్ అంబానీకి 25 కోట్లు జరిమానా
పారిశ్రామిక వేత్త అనిల్ అంబానీకి సెబీ షాక్ ఇచ్చింది. ఐదేళ్లపాటు నిషేధం విధిస్తూ నిర్ణయం తీసుకుంది. దీంతో పాటు అనిల్ అంబానీకి ఇరవై ఐదు కోట్ల రూపాయల జరిమానాను విధించింది. రిలయన్స్ హోం ఫైనాన్స్ నిధులను దారి మళ్లించారని ఈ చర్యలకు దిగింది. అనిల్ అంబానీ సంస్థలతో పాటూ మరో 24 సంస్థలపై కూడా నిషేధం విధించడం సంచనలంగా మారింది.
హైడ్రాకు నాగార్జున స్థలంపై ఫిర్యాదు
హైడ్రాకు సినీ నటుడు నాగార్జునకు సంబంధించి ఎన్ కన్వెన్షన్ సెంటర్ పై ఫిర్యాదు అందింది. తుమ్మకుంటలో చెరువును ఆక్రమించి మూడు ఎకరాల్లో ఎన్ కన్వెన్షన్ సెంటర్ ను నిర్మించారని హైదరాబాద్ డిజాస్టర్ రెస్పాన్స్ అండ్ అసెట్ ప్రొటెక్షన్ ఏజెన్సీకి జనం కోసం సంస్థ ఫిర్యాదు చేసింది.
కేజ్రీవాల్ కు మళ్లీ షాక్
ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ మరోసారి సుప్రీంకోర్టులో నిరాశ ఎదురయింది. ఈరోజు కేజ్రీవాల్ బెయిల్ పిటీషన్ పై సుప్రీంకోర్టులో కేజ్రీవాల్ బెయిల్ పిటిషన్ పై విచారణ జరిగింది. జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ ఉజ్జల్ భూయాన్ లతో కూడిన ధర్మాసనం ఈకేసును విచారించింది.
Tripura : భారీ వర్షాలకు 22 మంది మృతి
త్రిపురలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో రాష్ట్రంలో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. కొన్ని రోజులుగా కురుస్తున్న వర్షాలకు ప్రాణ, ఆస్తి నష్టం కూడా జరిగింది. వర్షాల వల్ల దాదాపు ఇరవై రెండు మంది చనిపోయినట్లు అధికార వర్గాలు ప్రకటించాయి. మరికొందరు గల్లంతయినట్లు చెబుతున్నారు.