26August-టాప్ 10 లేటెస్ట్ తెలుగు న్యూస్

కోల్‌కతాలోని ఆర్‌ జి కర్ మెడికల్ కాలేజ్ అండ్ హాస్పిటల్‌లో ట్రైనీ డాక్టర్‌పై అత్యాచారం, హత్య కేసులో ప్రధాన నిందితుడైన సంజయ్ రాయ్, ఫెసిలిటీ సెమినార్ హాల్‌కు చేరుకున్నప్పటికే బాధితురాలు అప్పటికే చనిపోయిందని లై డిటెక్టర్ పరీక్షలో చెప్పడం సంచలనంగా మారింది.

Update: 2024-08-26 12:45 GMT

(నోట్: పూర్తి వివరాలకు హెడ్లైన్ ని క్లిక్ చేయండి )

సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లు వ్యూస్, లైక్స్ కోసమే వీడియోలా? కనీసం అవగాహన లేదా?

కోల్‌కతాలోని ఆర్‌ జి కర్ మెడికల్ కాలేజ్ అండ్ హాస్పిటల్‌లో ట్రైనీ డాక్టర్‌పై అత్యాచారం, హత్య కేసులో ప్రధాన నిందితుడైన సంజయ్ రాయ్, ఫెసిలిటీ సెమినార్ హాల్‌కు చేరుకున్నప్పటికే బాధితురాలు అప్పటికే చనిపోయిందని లై డిటెక్టర్ పరీక్షలో చెప్పడం సంచలనంగా మారింది.

BJP : తెలంగాణలో బీజేపీకి రూట్ మ్యాప్ లేదు...క్షేత్రస్థాయిలో పోరాటం లేదుగా

తెలంగాణలో బీజేపీ ఇప్పుడు చేష్టలుడిగి చూడాల్సిన పరిస్థితి ఏర్పడింది. బీఆర్ఎస్, కాంగ్రెస్ ల మధ్య పోరు జరుగుతుండటంతో భారతీయ జనతా పార్టీ ఏం చేయాలో దిక్కుతోచని స్థితిలో ఉంది. అధికార కాంగ్రెస్ పార్టీ, ప్రతిపక్ష బీఆర్ఎస్ లు జనంలోకి వెళుతున్నాయి. కానీ బీజేపీకి మాత్రం ఎలాంటి అజెండా లేకుండా పోయింది.

హైదరాబాద్ లో 8 కోట్ల విలువైన డ్రగ్స్ స్వాధీనం

హైదరాబాద్ లో భారీగా డ్రగ్స్ పట్టుబడ్డాయి. వీటి విలువ 8.5 కోట్లు అని పోలీసులు చెబుతున్నారు. బోయినపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో భారీగా డ్రగ్స్ ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అందిన సమాచారం మేరకు ఈ దాడులు జరిపి ఇద్దరిని నిందితులను కూడా పట్టుకున్నారు.

Andhra Pradesh : కాపులకు చంద్రబాబు సూపర్ గుడ్ న్యూస్

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు త్వరలోనే కాపు సామాజికవర్గానికి గుడ్ న్యూస్ చెప్పబోతున్నారు. ఈ మేరకు పార్టీ వర్గాల ద్వారా సమాచారం అందింది. గత ఎన్నికల్లో తమ గెలుపునకు ప్రధాన కారణమైన కాపులను మరింత దగ్గరకు చేసుకునే ప్రయత్నంలో భాగంగా ఆయన వరాల జల్లు ప్రకటించడనున్నట్లు తెలిసింది.

మెదక్ జిల్లాలో ఎలుగుబంటి సంచారం.. వ్యక్తిపై దాడి

మెదక్ జిల్లా దూపిసింగ్ తండాలో ఎలుగుబంటి కలకలం రేపుతుంది. ఒక వ్యక్తిపై దాడి చేయడంతో గ్రామస్థులు అటవీ శాఖ అధికారులకు సమాచారం అందించారు. మెదక్ జిల్లా హవేలీఘనపూర్ మండలం దూపిసింగ్ తండాలో నివాసం ఉంటున్న రవి పొలంలో పనిచేస్తుండగా అకస్మాత్తుగా ఎలుగుబంటి దాడి చేసింది.

KTR : నేడు 20 మంది ఎమ్మెల్యేలతో కలసి ఢిల్లీకి కేటీఆర్

బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నేడు ఢిల్లీ వెళుతున్నారు. ఆయనతో పాటుగా ఇరవై మంది ఎమ్మెల్యేలు ఢిల్లీకి బయలుదేరి వెళుతున్నారు. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత బెయిల్ పిటీషన్ పై రేపు సుప్రీంకోర్టులో విచారణ ఉంది. ఈ నేపథ్యంలో కవితకు బెయిల్ వస్తుందని భావించి వీరంతా ఢిల్లీ వెళుతున్నట్లు చెబుతున్నారు.

ఢిల్లీలో ఘోర రోడ్డు ప్రమాదం.. నిద్రిస్తున్న వారిపైకి ట్రక్కు

ఢిల్లీలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఫుట్ పాత్ పై నిద్రిస్తున్న వారిపై ట్రక్కు దూసుకెళ్లింది. ఢిల్లీలోని శాస్త్రి పార్క్ ప్రాంతంలో ఈ ఘటన జరిగింది. దీంతో నిద్రిస్తున్న ముగ్గురు అక్కడిక్కడే మరణించారు. అయితే మృతులు ఎవరన్నది మాత్రం తెలియరాలేదు. ప్రమాదం జరిగిన వెంటనే భయపడిపోయిన ట్రక్కు డ్రైవర్ వాహనాన్ని అక్కడే వదిలేసి పారిపోయాడు.

Tirumala : తిరుమలలో నేటి భక్తుల రద్దీ ఎలా ఉందంటే?

తిరుమలలో భక్తుల రద్దీ నేడు కూడా కొనసాగుతుంది. సోమవారం కూడా అధిక సంఖ్యలో భక్తులు తిరుమలకు చేరుకున్నారు. కృష్ణాష్ణమి కావడంతో సెలవు దినం అయిన సోమవారం కూడా భక్తులు తిరుమలలోని శ్రీ వెంకటేశ్వరస్వామిని సందర్శించుకుంటున్నారు. శుక్ర వారం నుంచి తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతూనే ఉంది.

Revanth Reddy : వారికి శుభవార్త చెప్పిన రేవంత్ రెడ్డి

నిరుద్యోగులు విపక్షాల ట్రాప్ లో పడొద్దంటూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. అలాగే తాము ఉద్యోగాలను ఎన్నికల ప్రచారంలో చెప్పినట్లుగానే భర్తీ చేస్తామని తెలిపారు. ఈరోజు సెక్రటేరియట్ లో సివిల్స్ మెయిన్స్ కు అర్హత సాధించిన 135 మందికి లక్ష రూపాయల చొప్పున రేవంత్ రెడ్డి ఆర్థిక సాయం అందచేశారు.

పాక్ లో విషాదం.. వారి చేతిలో 23 మంది మృతి

పాకిస్థాన్ లో విషాదం చోటు చేసుకుంది. ముసుగులు ధరించిన కొందరు యువకులు వాహనాల్లో ప్రయాణిస్తున్న వారిని టార్గెట్ చేశారు. రహదారిపై నిల్చుని వాహనాలను అడ్డగించి వారిని అందులో నుంచి దింపేసి కాల్చేశారు.ఈ ఘటనలో ఇరవై మూడు మంది ప్రయాణికులు మరణించారు.


Tags:    

Similar News