27August-టాప్ 10 లేటెస్ట్ తెలుగు న్యూస్

శ్రీశైలం జలాశయానికి వరద కొనసాగుతుంది. గతంలో కంటే కొంత వాననీటి ప్రవాహం తగ్గినా ఇంకా నీరు వచ్చి చేరుతుందని అధికారులు చెబుతున్నారు. గత కొంత కాలంగా శ్రీశైలంలో ఎడమ, కుడి వైపు జలవిద్యుత్పత్తి కొనసాగుతున్న సంగతి తెలిసిందే.

Update: 2024-08-27 12:30 GMT

(నోట్: పూర్తి వివరాలకు హెడ్లైన్ ని క్లిక్ చేయండి )

Srisailam Project : శ్రీశైలం జలాశయానికి కొనసాగుతున్న వరద

శ్రీశైలం జలాశయానికి వరద కొనసాగుతుంది. గతంలో కంటే కొంత వాననీటి ప్రవాహం తగ్గినా ఇంకా నీరు వచ్చి చేరుతుందని అధికారులు చెబుతున్నారు. గత కొంత కాలంగా శ్రీశైలంలో ఎడమ, కుడి వైపు జలవిద్యుత్పత్తి కొనసాగుతున్న సంగతి తెలిసిందే. శ్రీశైలంలో కొన్ని గేట్లు ఎత్తి దిగువకు నీటిని కూడా విడుదల చేశారు.

Telangana : అందరూ ఒక వైపు... రేవంత్ రెడ్డి ఒక్కడూ ఒక వైపు

హైడ్రా బుల్‌డోజర్ కు రాజకీయ పార్టీలు బ్రేకులు వేసేటట్లే కనిపిస్తుంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఒక్కరే ఒక వైపు మిగిలిన అన్ని రాజకీయ పార్టీలు ఒకవైపుగా పరిస్థితి మారింది. గత నెలరోజుల నుంచి హైడ్రా దూకుడుగా ముందుకు వెళుతుంది. చెరువులను, నాలాలను, కుంటలను ఆక్రమించిన వాటిని నిర్దాక్షిణ్యంగా కూల్చి పారేస్తుంది.

Chandrababu : చంద్రబాబుకు తెలియకుండానే టీడీపీ నేతలు నాలుగు చేతులా సంపాదిస్తున్నారా?

అవును.. ఇప్పుడు తెలుగుదేశం పార్టీలో ఇదే చర్చనీయాంశమైంది. చంద్రబాబు నాయుడు కళ్లు కప్పి మరీ టీడీపీ నేతలు అడ్డంగా దోపిడీకి పాల్పడుతున్నారు. చంద్రబాబు నాయుడుకు మాత్రం క్షేత్ర స్థాయిలో సమాచారం అందకపోవడంతో అంతా ఒకే అని అనుకుంటున్నారు.

Vijaya Sai Reddy : గవర్నర్ పదవి కోసం విజయసాయిరెడ్డి?

వైసీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయి రెడ్డి గవర్నర్ పదవి కోసం ప్రయత్నిస్తున్నారు. ఢిల్లీలో పెద్దయెత్తున లాబీయింగ్ చేస్తున్నారు. తనకున్న పరిచయాలతో ఢిల్లీ పెద్దలను కలసి తనను గవర్నర్ గా పంపించాలని కోరుతున్నారు. విజయసాయి రెడ్డి ఇటీవల ఒంటరిగా వెళ్లి కేంద్ర హోం మంత్రి అమిత్ షాను కలవడం వెనక ఇదే కారణమని అంటున్నారు.

Breaking : కవితకు బిగ్ రిలీఫ్

బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత బెయిల్ పై నేడు సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. కవితకు బెయిల్ మంజూరయింది. జస్టసిస్ బీఆర్ గవాయ్, జస్టిస్ విశ్వనాధన్ ధర్మాసనం విచారించింది. ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో కవిత ప్రమేయంపై సీబీఐ, ఈడీలు కేసుల్లో ఆమె తనకు బెయిల్ ఇప్పించాలంటూ సుప్రీంకోర్టును ఆశ్రయించారు.

Vegetables : కూరగాయలు ఫ్రీ... ఎగబడిన జనం

ప్రస్తుతం మార్కెట్ లో కూరగాయల ధరలు మండి పోతున్నాయి. గతంలో ఎన్నడూ లేని విధంగా అన్ని కూరగాయల ధరలు పెరిగాయి. టమాటా ధర గతంలో కంటే కొంత తగ్గినప్పటికీ మిగిలిన కూరగాయల ధరలు మాత్రం వినియోగదారులకు చుక్కలు చూపిస్తున్నాయి. బెండకాయలు, దొండకాయలు, ఆలుగడ్డ, చిక్కుడు కాయ, వంకాయ, పొట్లకాయ వంటి కూరగాయల ధరలు ఎక్కువగా ఉన్నాయి.

జువ్వాడ ఫామ్ హౌస్‌లో కొలతలు వేస్తున్న అధికారులు

జువ్వాడ ఫామ్ హౌస్ కు నీటిపారుదల శాఖ అధికారులు చేరుకున్నారు. రంగారెడ్డి జిల్లా శంకరపల్లిలో జువ్వాడ ఫామ్ హౌస్ ఉంది. అక్కడకు చేరుకున్న ఇరిగేషన్ అధికారులు కొలతలు వేస్తున్నారు. జువ్వాడ ఫామ్ హౌస్ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ దిగా ప్రచారం జరిగింది. అయితే కేటీఆర్ మాత్రం అది తన స్నేహితుడదని, తాను లీజుకు తీసుకున్నానని చెప్పారు.

కేరళ ఎక్స్‌ప్రెస్ కు తప్పిన ప్రమాదం

కేరళ ఎక్స్‌ప్రెస్ కు తృటిలో ప్రమాదం తప్పింది. ఖమ్మం జిల్లా రఘునాధపాలెం మండలం పాపటపల్లి రైల్వేస్టేషన్ ప్లాట్‌ఫారం వద్ద ఈ ఘటన జరిగింది. వృద్ధుల కోసం నిర్మించిన చిన్న వంతెన మీదుగా బైక్ మీద వెళ్లేందకు ఒక యువకుడు ప్రయత్నించాడు. కానీ అదే సమయంలో కేరళ ఎక్స్‌ప్రెస్ వస్తుండటం చూసి బైక్ ను రైలు పట్టాలపై వదిలేసి పారిపోయాడు.

కారు - కంటెయినర్ ఢీ ఐదుగురు మృతి

అన్నమయ్య జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఐదుగురు మరణించారు. నిన్న రాత్రి కడప వైపు నుంచి వస్తున్న కారును కంటెయినర్ ఢీకొట్టడంతో ఈ ఘటన చోటు చేసుకుంది. కంటెయినర్ కడపకు వెళుతుంది. ఘాట్‌రోడ్ లో మూడో మలుపు వద్ద ఈ ప్రమాదం జరిగింది.

నేటి గ్యాస్ సిలిండర్ ధరలు ఇలా

చమురు సంస్థలు గ్యాస్ సిలిండర్ల ధరలను ప్రతి నెల ఒకటో తేదీన సమీక్షిస్తుంటాయి. ధరలను పెంచడమో, తగ్గించడమో జరుగుతుంది. అంతర్జాతీయంగా క్రూడాయిల్ ధరలను బట్టి పెట్రోలు, డీజిల్ ధరలను కూడా చమురు సంస్థలు నిర్ణయిస్తుంటాయి. ప్రతి నెల ఫస్ట్ తేదీన ధరలను సమీక్షించడం గత కొద్ది రోజులుగా కమర్షియల్ సిలిండర్ ధరలపైనే ఎక్కువగా హెచ్చు తగ్గులు కనపడుతున్నాయి.

https://www.telugupost.com/telangana/oil-companies-review-the-prices-of-gas-cylinders-on-the-1st-of-every-month-prices-may-be-increased-or-decreased-1549249

https://www.telugupost.com/telangana/oil-companies-review-the-prices-of-gas-cylinders-on-the-1st-of-every-month-prices-may-be-increased-or-decreased-1549249


Tags:    

Similar News