28August-టాప్ 10 లేటెస్ట్ తెలుగు న్యూస్

పశ్చిమ బెంగాల్ లో బంద్ సందర్భంగా కొన్ని చోట్ల హింసాత్మక ఘటనలు జరిగాయి. విద్యార్థులపై పోలీసులు అమానుష చర్యకు నిరసనగా బీజేపీ పన్నెండు గంటల పాటు పశ్చిమ బెంగాల్ బంద్ కు పిలుపు నివ్వడంతో దుకాణాలన్నీ మూసివేశారు.

Update: 2024-08-28 13:47 GMT

(నోట్: పూర్తి వివరాలకు హెడ్లైన్ ని క్లిక్ చేయండి )

పశ్చిమ బెంగాల్ బంద్ హింసాత్మకం

పశ్చిమ బెంగాల్ లో బంద్ సందర్భంగా కొన్ని చోట్ల హింసాత్మక ఘటనలు జరిగాయి. విద్యార్థులపై పోలీసులు అమానుష చర్యకు నిరసనగా బీజేపీ పన్నెండు గంటల పాటు పశ్చిమ బెంగాల్ బంద్ కు పిలుపు నివ్వడంతో దుకాణాలన్నీ మూసివేశారు. విద్యార్థులపై లాఠీఛార్జి చేయడానికి నిరసనగా ఈ బంద్ ను నిర్వహిస్తున్నారు.

నేడు కేబినెట్ లో చంద్రబాబు అదిరిపోయే గుడ్ న్యూస్ చెప్పనున్నారా?

ఆంధ్రప్రదేశ్ లో ప్రభుత్వం ఏర్పడి మూడు నెలలు కావస్తుంది. ఇప్పటి వరకూ ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమలు చేయలేదు. దీనిపై వైసీపీ విమర్శలు చేస్తుంది. ప్రజల్లో కూడా ఒకింత ఇంకా ఎప్పుడు అంటూ ప్రశ్నలు వినిపిస్తున్నాయి. అయితే రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగా లేదని, నిదానంగా చెప్పిన హామీలను అమలు చేస్తామని టీడీపీ నేతలు చెబుతున్నారు.

Pawan Kalyan : పవన్ దెబ్బకు కూటమి ప్రభుత్వం వణుకుతుందా?

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ దెబ్బకు కూటమి ప్రభుత్వంలో మంత్రులు, ఎమ్మెల్యేలు భయపడిపోతున్నారు. ఇక జనసేన ఎమ్మెల్యేల సంగతి సరేసరి. పవన్ కల్యాణ‌్ మార్పు తేవడానికే రాజకీయాల్లోకి వచ్చారు. అవినీతికి తావులేని పాలనను అందించాలని భావించి ఆయన జనసేన పార్టీని స్థాపిించారు.

Revanth Reddy : రేవంత్ రెడ్డి హైడ్రా ఏర్పాటుకు అసలు కారణమదేనా?

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పీడ్ మీదున్నారు. డెసిషన్స్ చాలా ఫాస్ట్ గా తీసుకుంటూ ప్రత్యర్థుల గుండెల్లో దడ పుట్టిస్తున్నారు. ప్రధానంగా కాంగ్రెస్ పార్టీ మరోసారి అధికారంలోకి రావాలంటే ముందు ప్రత్యర్థి పార్టీల ఆర్థిక మూలాలను దెబ్బతీసే ఆలోచనలో ఉన్నారు. ప్రధానంగా బీఆర్ఎస్ పార్టీ గత పదేళ్లుగా తెలంగాణలో అధికారంలో ఉంది.

ఐదున్నర నెలల తర్వాత కవిత సొంత ఇంటికి

బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత శంషాబాద్ ఎయిర్ పోర్టుకు కొద్డిసేపటి క్రితం చేరుకున్నారు. ఢిల్లీ నుంచి విమానంలో కుటుంబ సభ్యులతో కలసి వచ్చిన కవితకు బీఆర్ఎస్ నేతలు, కార్యకర్తలు పెద్దయెత్తున స్వాగతం పలికారు. ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో అరెస్టయి ఐదునెలల పాటు తీహార్ జైలులో ఉన్న కల్వకుంట్ల కవితకు నిన్న సుప్రీంకోర్టు బెయిల్ ఇచ్చిన సంగతి తెలిసిందే.

మల్లారెడ్డి అల్లుడి కళాశాలలకు నోటీసులు

మాజీ మంత్రి మల్లారెడ్డి అల్లుడు మర్రి రాజశేఖర్ రెడ్డి కళాశాలలకు రెవెన్యూ అధికారులు నోటీసులు జారీ చేశారు. మల్లారెడ్డి అల్లుడు రాజశేఖర్ రెడ్డికి చెందిన ఇంజినీరింగ్ కళాశాలను అక్రమంగా నిర్మించారని రెవెన్యూ అధికారులు నోటీసుల్లో పేర్కొన్నారు. మల్లారెడ్డి అల్లుడు మర్రి రాజశేఖర్ రెడ్డికి దుండిగల్ లో ఎంఎల్ఆర్‌టీ, ఏరోనాటికల్ ఇంజినీరింగ్ కళాశాలలు ఉన్నాయి.

NaraLokesh : రెడ్ బుక్ పై లోకేష్ సంచలన వ్యాఖ్యలు

ఆంధ్రప్రదేశ్ మంత్రి నారా లోకేష్ సంచలన వ్యాఖ్యలు చేశారు. గత ప్రభుత్వంలో తప్పు చేసిన వైసీపీ నేతల పేర్లు రెడ్ బుక్ లో ఉన్నాయని తెలిపారు. వారిని ఎవరినీ వదిలపెట్టేది లేదని లోకేష్ వార్నింగ్ ఇచ్చారు. గత ప్రభుత్వంలో తప్పుడు కేసులు పెట్టడమే కాకుండా అరాచకాలకు పాల్పడిన వారందరూ చట్టప్రకారం శిక్ష అనుభవించక తప్పదన్నారు.

Revanth Reddy : డిసెంబరు 9న తెలంగాణ తల్లి విగ్రహావిష్కరణ

సచివాలయంలో తెలంగాణ తల్లి విగ్రహానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి భూమి పూజ చేశారు. పదేళ్ల నుంచి నిర్లక్ష్యానికి గురైన తెలంగాణ తల్లి విగ్రహ స్థాపనకు నేడు శ్రీకారం చుట్టామన్నారు. పదేళ్ల పాలన చేపట్టిన వారు తెలంగాణ తల్లిని పట్టించుకోలేదన్నారు. వారే తెలంగాణ సర్వస్వం అన్నట్లు వ్యవహరించారన్నారు రేవంత్ రెడ్డి.

Hydra : త్వరలో హైడ్రా పోలీస్ స్టేషన్లు... ఎవరినీ వదిలపెట్టం

త్వరలో హైడ్రా పోలీస్ స్టేషన్లను ఏర్పాటు చేయనున్నట్లు కమిషనర్ రంగనాధ్ తెలిపారు. హైడ్రా పేరిట ప్రత్యేక చట్టం తేనున్నట్లు కూడా ఆయన తెలిపారు. దీనిపై ప్రభుత్వం పూర్తి స్థాయిలో కసరత్తులు చేస్తుందన్నారు. ఇందుకు సంబంధించిన విధివిధానాలను, నిబంధనలు తయారైన తర్వాత చట్టాన్ని ప్రభుత్వం రూపొందిస్తుందని తెలిపారు.

నిజామాబాద్ లో రోడ్డు ప్రమాదం ...ఇద్దరు యువకుల మృతి

నిజామాబాద్‌లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఇద్దరు యువకులు అక్కడికక్కడే మరణించారు. ఆగి ఉన్న లారీని కారు ఢీకొట్టడంతో ఇద్దరు యువకులు మృతి చెందారు. ఈరోజు తెల్లవారుజామున ఈ ఘటన చోటు చేసుకుంది. నిజామాబాద్ రూరల్ మండలలోని శ్రీనగర్ వద్ద ఆగి ఉన్న లారీని వేగంగా వచ్చిన కారు ఢీకొట్టడంతో కారులో ఉన్న ఇద్దరు యువకులు మరణించారు.


Tags:    

Similar News