30 August-టాప్ 10 లేటెస్ట్ తెలుగు న్యూస్
తెలంగాణలో పార్టీ మారిన ఎమ్మెల్యేల వ్యవహారంపై నేడు హైకోర్టులో విచారణ జరగనుంది. బీఆర్ఎస్ గుర్తు మీద గెలిచి కాంగ్రెస్ పార్టీలోకి మారిన పది మంది ఎమ్మెల్యేలపై హైకోర్టులో విచారణ జరగనుంది.
(నోట్: పూర్తి వివరాలకు హెడ్లైన్ ని క్లిక్ చేయండి )
Telangana : నేడు పార్టీ మారిన ఎమ్మెల్యేల కేసు విచారణ
తెలంగాణలో పార్టీ మారిన ఎమ్మెల్యేల వ్యవహారంపై నేడు హైకోర్టులో విచారణ జరగనుంది. బీఆర్ఎస్ గుర్తు మీద గెలిచి కాంగ్రెస్ పార్టీలోకి మారిన పది మంది ఎమ్మెల్యేలపై హైకోర్టులో విచారణ జరగనుంది. పార్టీ మారిన వారిపై అనర్హత వేటు వేయాలని బీఆర్ఎస్ హైకోర్టు ఆదేశించిన నేపథ్యంలో ఈ విచారణ జరుగుతుంది.
Cables from electric poles: వాటిని తొలగించాలట.. అయ్యో ఇప్పుడెలా?
విద్యుత్ స్తంభాల నుండి అనవసరమైన కేబుల్స్, ఇతర వస్తువులను వెంటనే తొలగించాలని లేని పక్షంలో వారిపై చర్యలు తీసుకుంటామని సదరన్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ ఆఫ్ తెలంగాణ లిమిటెడ్ (TGSPDCL) చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ ముషారఫ్ ఫరూఖీ కేబుల్ ఆపరేటర్లు, ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్లను హెచ్చరించారు.
Pushpa 2: ఓ వైపు పుష్ప-3 హింట్స్.. పుష్ప-2 రిలీజ్ ఆరోజే పక్కా
అల్లు అర్జున్-సుకుమార్ కాంబినేషన్ లో వస్తున్న సినిమా పుష్ప-2. ఈ సినిమా మీద ఉన్న హైప్ అంతా ఇంతా కాదు. ముఖ్యంగా నార్త్ ఇండియాలో పుష్ప-2 సినిమా కోసం ఎంతగానో ఎదురుచూస్తూ ఉన్నారు. పుష్ప-2 లో ఏ క్యారెక్టర్ ఏమవుతుందా అనే క్యూరియాసిటీ ప్రతి ఒక్కరిలోనూ ఉంది.
Hydra : హైడ్రా బుల్‌డోజర్ రేపు పయనమెటో? రూట్ మాప్ అదేనా?
హైడ్రా అంటేనే నగరంలో దడ మొదలయింది. సంపన్నుల నుంచి మధ్యతరగతి ప్రజల వరకూ భయపడిపోతున్నారు. హైదరాబాద్ లో హైడ్రా కూల్చివేతలను ఆపడం లేదు. ప్రతి రోజూ ఏదో ఒక చోట కూల్చివేతలను జరుపుతూనే ఉంది. కొందరికి నోటీసులు ఇచ్చి హైడ్రా కూల్చి వేతలు జరుపుతుండగా, మరికొందరికి మాత్రం నోటీసులు ఇవ్వకుండానే అక్రమ నిర్మాణమని తేలితే చాలు కూల్చివేయడం మొదలుపెట్టేస్తుంది.
మూడు నెలలు జీతాల్లేవ్.. స్పైస్ జెట్ కీలక నిర్ణయం
విమానయాన సంస్థ స్పైస్ జెట్ కీలక నిర్ణయం తీసుకుంది. మూడు నెలల పాటు ఉద్యోగులకు జీతాలు ఇవ్వకూడదని నిర్ణయం తీసుకుంది. స్పైస్ జెట్ ఆర్థిక సంక్షోభంలో ఉండటంతో దాని నుంచి బయట పడేందుకు సిబ్బందికి మూడు నెలల జీతాలను ఇవ్వకూడదని నిర్ణయించడం సిబ్బందిలో ఆందోళనకు కారణమయింది.
Tirumala : లడ్డూల విక్రయాలపై అసలు నిజం ఇదీ
లడ్డూల విక్రయాలపై తిరుమల తిరుపతి దేవస్థానం వివరణ ఇచ్చింది. దర్శనం చేసుకుని వచ్చిన భక్తులకు ఎన్ని లడ్డూలైనా ఇస్తామని చెప్పింది. అయితే దర్శనం చేసుకోకుండా కొందరు లడ్డూలను కౌంటర్ లో ఎక్కువ మొత్తంలో కొనుగోలు చేసి బ్లాక్ మార్కెట్ లో కొందరు విక్రయిస్తున్నట్లు తమ దృష్టికి వచ్చిందని అధికారులు చెప్పారు.
Rajya Sabha : రాజ్యసభకు చంద్రబాబు ఎంపిక చేసేది వారిద్దరినేనా?
రాజ్యసభకు ఇద్దరు వైసీపీ సభ్యులు రాజీనామా చేశారు. మోపిదేవి వెంకటరమణ, బీద మస్తాన్ రాజీనామాలతో త్వరలో ఉప ఎన్నికలు జరగనున్నాయి. ఇద్దరు రాజీనామాలను రాజ్యసభ ఛైర్మన్ ఆమోదించారు. రెండు స్థానాలు ఖాళీ అయినట్లు రాజ్యసభ బులిటెన్ కూడా విడుదల చేసింది.
Rain Alert: ఆంధ్రప్రదేశ్‌లోని పలు ప్రాంతాలకు భారీ వర్ష సూచన
ఆగస్ట్ 30 నుండి రాబోయే మూడు రోజులలో ఆంధ్రప్రదేశ్‌లోని పలు ప్రాంతాల్లో బలమైన ఉపరితల గాలులతో, భారీ నుండి అతి భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ శుక్రవారం అంచనా వేసింది. ఉత్తర కోస్తా ఆంధ్ర ప్రదేశ్, యానాం, దక్షిణ కోస్తా ప్రాంతాల్లో భారీ నుండి భారీ వర్షాలు కురుస్తాయని అంచనా వేసింది.
Bandi Sanjay: కాంగ్రెస్ ప్రభుత్వం వాళ్ళను చూసి భయపడుతోంది: బండి సంజయ్
హైదరాబాద్ డిజాస్టర్ మేనేజ్‌మెంట్ అండ్ అసెట్స్ ప్రొటెక్షన్ ఏజెన్సీ (హైడ్రా) సరస్సులు, చెరువులు, ఫుల్ ట్యాంక్ లెవల్స్, బఫర్ జోన్‌ల చుట్టూ ఉన్న అక్రమ ఆక్రమణలను కూల్చివేస్తూ వెళుతోంది. అయితే పలువురు రాజకీయ నేతలు హైడ్రా పక్షపాతంతో వ్యవహరిస్తోందని ఆరోపించారు.
Shivaji Statue: వారికి నేను శిరస్సు వంచి క్షమాపణలు చెబుతున్నా: ప్రధాని మోదీ
ఆగస్టు 26న మహారాష్ట్రలోని సింధుదుర్గ్‌లో ఛత్రపతి శివాజీ మహారాజ్ విగ్రహం కూలిన ఘటనపై తీవ్ర విమర్శలు వచ్చిన సంగతి తెలిసిందే. ఈ ఘటనపై ప్రధాని నరేంద్ర మోదీ శుక్రవారం క్షమాపణలు చెప్పారు. మహారాష్ట్రలోని పాల్‌ఘర్‌లో శుక్రవారం జరిగిన ఓ కార్యక్రమంలో ప్రధాని మోదీ కీలక వ్యాఖ్యలు చేశారు.