31August-టాప్ 10 లేటెస్ట్ తెలుగు న్యూస్
నిన్నటి నుంచి కురుస్తున్న భారీ వర్షంతో విజయవాడ వణికిపోతుంది. రహదారులన్నీ జలమయమయ్యాయి. రోడ్లపైకి నీరు చేరడంతో వాహనాల రాకపోకలకు కష్టంగా మారింది. దీంతో వర్షపు నీటిలో వాహనాలు చిక్కుకుపోయి అనేక మంది వాహనదారులు ఇబ్బంది పడుతున్నారు. గతంలో ఎన్నడూ లేని విధంగా వర్షం పడుతుండటంతో విజయవాడ నగరవాసులు భయపడిపోతున్నారు.
(నోట్: పూర్తి వివరాలకు హెడ్లైన్ ని క్లిక్ చేయండి )
Vijayawada : భారీ వర్షంతో వణుకుతున్న బెజవాడ
నిన్నటి నుంచి కురుస్తున్న భారీ వర్షంతో విజయవాడ వణికిపోతుంది. రహదారులన్నీ జలమయమయ్యాయి. రోడ్లపైకి నీరు చేరడంతో వాహనాల రాకపోకలకు కష్టంగా మారింది. దీంతో వర్షపు నీటిలో వాహనాలు చిక్కుకుపోయి అనేక మంది వాహనదారులు ఇబ్బంది పడుతున్నారు. గతంలో ఎన్నడూ లేని విధంగా వర్షం పడుతుండటంతో విజయవాడ నగరవాసులు భయపడిపోతున్నారు.
Rain Alert : హైదరాబాదీలకు వార్నింగ్.. ఈరోజు బయటకు వెళ్లకపోవడమే మంచిదట
తెలంగాణలో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ చెప్పింది. అలాగే హైదరాబాద్ లో అతి భారీ వర్షం కురిసే ఛాన్స్ ఉందని పేర్కొంది. దీంతో పాటు బలమైన ఈదురుగాలులు వీచే అవకాశముంది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ సూచించింది. అల్పపీడనం మరింత బలపడి వాయుగుండంగా మారే అవకాశముందని తెలిపింది.
Hydra : హైడ్రాతో రేవంత్ కెలుక్కున్నారా? అందరూ వ్యతిరేకమవుతున్నారా?
హైదరాబాద్ డిజాస్టర్ రెస్పాన్స్ అండ్ అసెట్ ప్రొటెక్షన్ ఏజెన్సీక ఏర్పాటుతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చాలా మందికి శత్రువుగా మారనున్నారు. కొన్నేళ్ల నుంచి నివాసముంటున్న ఇళ్లను, నిర్మాణాలను, కమర్షియల్ కాంప్లెక్స్ లను కూల్చివేస్తుండటంతో హైడ్రాను తెచ్చి లేనిపోని వివాదాన్ని తెచ్చుకున్నారని పార్టీ నేతలే అభిప్రాయపడుతున్నారు.
అప్పుల బాధ నుంచి తప్పించుకోవడానికే ఏలూరు కాల్వలోకి కారును తోసేసి?
ఏలూరు కాల్వలో కారు దూసుకెళ్లిన ఘటనలో ట్విస్ట్ చోటు చేసుకుంది. అదుపు తప్పి కారు ఏలూరు కాల్వలో పడిందని పోలీసులు తొలుత భావించారు. కానీ కారును ఏలూరు కాల్వలోకి తోసేసి తాను క్షేమంగా బంధువులు ఇంటికి వెళ్లి తలదాచుకున్నట్లు పోలీసుల విచారణలో వెల్లడయింది.
హైడ్రా యాక్షన్.. ఆరుగురు అధికారులపై కేసు
హైడ్రా అధికారులపై యాక్షన్ కు దిగింది. ఆరుగురు అధికారులపై వేటుకు సిఫార్సు చేసింది. దీంతో ఆరుగురు అధికారులు పై కేసు నమోదయింది. సైబరాబాద్ పోలీసులు కసు నమోదు చేశారు.నిజాంపేట, చందానగర్, హెచ్ఎడీఏ సిటీ ప్లానర్ , అసిస్టెంట్ ప్లానింగ్ అధికారి, బాచుపల్లి తహసిల్దార్ పై కేసు నమోదు చేసింది.
Breaking : హైదరాబాద్ లో పబ్ లపై దాడులు.. డ్రగ్స్ కలకలం
హైదరాబాద్ లో పబ్ లపై అధికారులు దాడులు నిర్వహించారు. ఇరవై ఐదు పబ్ లలో అధికారులు ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. ఇందులో ఆరుగురు డ్రగ్స్ తీసుకున్నట్లు నిర్ధారణ అయిందని పోలీసులు తెలిపారు. డ్రగ్స్ తీసుకున్న వారిలో ఇద్దరు యువతులు, ముగ్గురు యువకులు ఉన్నారని అధికారులు తెలిపారు.
నేడు పాఠశాలలకు సెలవులు
వాయువ్య బంగాళాఖాతంలో అల్పపీడనంతో నేడు ఎన్టీఆర్ జిల్లాలో పాఠశాలలకు సెలవును ప్రకటించారు. ఈ మేరకు కలెక్టర్ ఉత్తర్వులు జారీ చేశారు. భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అలెర్ట్ చేయడంతో ముందస్తు జాగ్రత్తగా పాఠశాలలకు సెలవులు ప్రకటిస్తూ కలెక్టర్ ఉతర్వులు జారీ చేశారు.
Narendra Modi : గుడ్ న్యూస్.. నేడు ఆ రూట్లలో వందేభారత్.. ప్రారంభించనున్న మోదీ
ప్రధాని నరేంద్ర మోదీ నేడు మూడు వందే భారత్ రైళ్లను ప్రారంభించనున్నారు. దక్షిణ రైల్వేజోన్ కు చెందిన రెండు రైళ్లతో పాటు ఉత్తర్‌ప్రదేశ్ లో మరో రైలు ప్రారంభిస్తారు. దక్షిణ భారత దేశంలో చెన్నై టు నాగర్‌కోయిల్ రైలును ప్రారంభించనున్నారు. ఈ రైలు చెన్నైతో పాటు నాగర్‌కోయిల్ మధ్య నడవనుంది.
Andhra Pradesh : ఏపీలో ఒకరోజు ముందుగానే పింఛన్ల పంపిణీ ప్రారంభం
ఆంధ్రప్రదేశ్ లో నేటి ఉదయం నుంచే పింఛన్ల పంపిణీ కార్యక్రమం ప్రారంభమయింది. సెప్టెంబరు1వతేదీన పింఛన్లు పంపిణీ చేయాల్సి ఉండగా అయితే ఆరోజు ఆదివారం కావడంతో ఒక రోజు ముందుగానే పంపిణీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. అందుకే నేటి నుంచి రాష్ట్ర వ్యాప్తంగా పింఛన్ల పంపిణీ కార్యక్రమం ప్రారంభమయింది.
ప్రాజెక్టులకు జల కళ.. నిండిన జలాశయాలు
శ్రీశైలం జలాశయానికి వరద నీరు కొనసాగుతుంది. శ్రీశైలం జలాశయానికి చెందిన తొమ్మది గేట్లను పది అడుగుల మేర అధికారులు ఎత్తి దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు. శ్రీశైలం ప్రాజెక్టు ఇన్ ఫ్లో 3,27,610 క్యూసెక్కులు ఉండగా, ఔట్ ఫ్లో 3,21,077 క్యూసెక్కులు ఉంది. పూర్తి స్దాయి నీటి మట్టం 885.00 అడుగులు కాగా ప్రస్తుతం ప్రస్తుత నీటిమట్లం 885.00 అడుగులు ఉంది.