టాప్ 10 లేటెస్ట్ తెలుగు న్యూస్

మీరు టైప్-2 డయాబెటిస్‌తో బాధపడుతుంటే, ఏమి తినాలి..? ఏమి తినకూడదు అనేది మీ మదిలో నిరంతరం మెదులుతూ ఉంటుంది. మీరు రక్తంలో చక్కెర స్థాయిని సరిగ్గా ఉంచుకోవాలంటే మీరు ఆహారం గురించి ఆలోచించాలి. ఆరోగ్యకరమైన ఆహారంతో పాటు, మీరు ఈ 6 పానీయాలను కూడా తాగవచ్చు.

Update: 2024-03-06 12:56 GMT

(నోట్: పూర్తి వివరాలకు హెడ్లైన్ ని క్లిక్ చేయండి )

Diabetes Drinks: ఉదయం పూట షుగర్ లెవెల్స్ ఎక్కువగా ఉంటున్నాయా? ఈ 6 డ్రింక్స్‌తో అదుపులో..

మీరు టైప్-2 డయాబెటిస్‌తో బాధపడుతుంటే, ఏమి తినాలి..? ఏమి తినకూడదు అనేది మీ మదిలో నిరంతరం మెదులుతూ ఉంటుంది. మీరు రక్తంలో చక్కెర స్థాయిని సరిగ్గా ఉంచుకోవాలంటే మీరు ఆహారం గురించి ఆలోచించాలి. ఆరోగ్యకరమైన ఆహారంతో పాటు, మీరు ఈ 6 పానీయాలను కూడా తాగవచ్చు.

Shahbaz Nadeem: షాబాజ్ నదీమ్.. షాకింగ్ నిర్ణయం

టీమిండియా క్రికెటర్ షాబాజ్ నదీమ్ క్రికెట్‌లోని అన్ని ఫార్మాట్లకు గుడ్‌బై చెప్పేశాడు. 34 ఏళ్ల ఈ లెఫ్టార్మ్ స్పిన్నర్ క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించి.. ప్రపంచవ్యాప్తంగా టీ20 లీగ్‌లు ఆడాలని అనుకున్నట్లు తెలిపాడు. రిటైర్మెంట్‌పై చాలాకాలంగా ఆలోచిస్తున్నానని, ఇప్పుడు అన్ని ఫార్మాట్ల నుంచి తప్పుకోవాలని నిర్ణయించుకున్నట్టు వివరించాడు.

Organ Donation:తెగిపోయిన చేతులు.. ఓ మహిళ కారణంగా తిరిగి వచ్చేశాయి

Organ Donation:ఒక ఘోర ప్రమాదంలో రెండు చేతులు కోల్పోయిన ఒక పెయింటర్.. మళ్లీ తన చేతుల్లోకి కుంచెను తీసుకోబోతున్నాడు, ఢిల్లీ వైద్య బృందం చేసిన శస్త్రచికిత్స కారణంగా ఆ వ్యక్తికి చేతులు తిరిగి వచ్చాయి. ఒక మహిళ చేసిన అవయవ దానం.. నలుగురి జీవితాలలో వెలుగులు నింపింది.

Good News CNG prices cut: భారీగా తగ్గిన CNG ధర

ముంబైకి చెందిన మహానగర్ గ్యాస్ లిమిటెడ్ (MGL) కంప్రెస్డ్ నేచురల్ గ్యాస్ (CNG) ధరను తగ్గించింది. ఇప్పుడు కిలోగ్రాము రూ. 73.50కి ఇస్తున్నట్లు ప్రకటించింది. ఇది మార్చి 5, 2024 అర్ధరాత్రి నుండి ఈ ధర ప్రారంభమైంది. గ్యాస్ ధర తగ్గిన కారణంగా.. ముంబై.. చుట్టుపక్కల ప్రాంతాలలో CNG ధర కిలోగ్రాముకు రూ. 2.5 తగ్గింది. MGL ప్రధానంగా ముంబైలో CNGని సరఫరా చేస్తుంది.

Hyderabad: నడుస్తున్న కారులో మంటలు.. ప్రయాణికులుంగానే డ్రైవర్‌ ఏం చేశాడంటే..

హైదరాబాద్‌ నగరంలో ఎన్నో ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి. ముఖ్యంగా ఎండకాలం కాబట్టి అగ్ని ప్రమాదాలు పెరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. తాజాగా బుధవారం హైదరాబాద్‌లోని సైఫాబాద్‌ రోడ్డు వద్ద మధ్యాహ్నం నడుస్తున్న కారులో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది.

Garlic: రోజూ వెల్లుల్లి రెబ్బలు తింటుంటే ఎలాంటి లాభాలు ఉంటాయో తెలుసా?

రోజు ఒక వెల్లుల్లి రెబ్బను తినడం అలవాటు చేసుకుంటే కొలెస్ట్రాల్ నుండి మొదలుకొని అనేక ఇతర వ్యాధుల నుండి బయటపడవచ్చు. కానీ మీరు సరైన ఆహారాన్ని తెలుసుకోవాలి. అప్పుడే మీరు ప్రయోజనం పొందుతారు. వెల్లుల్లి నిజానికి రోగనిరోధక వ్యవస్థను మెరుగుపరచడంలో సహాయపడుతుంది.

Shivaratri Special Shows : హైదరాబాద్‌లో శివరాత్రికి స్పెషల్ సినిమా షోస్ ఇవే..

మార్చి 8న మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా.. హైదరాబాద్ లోని కొన్ని థియేటర్స్ లో మూవీ లవర్స్ కోసం కొన్ని సినిమాలు ప్రత్యేక షోలో వేయబోతున్నారు. ఈ సినిమాల్లో చిరంజీవి, పవన్ కళ్యాణ్, ప్రభాస్, ఎన్టీఆర్ చిత్రాలు కూడా ఉన్నాయి. ఆల్రెడీ ఈ సినిమాలకు సంబంధించిన టికెట్ బుకింగ్స్ కూడా ఆన్‌లైన్ లో ఓపెన్ అయ్యాయి.

Janhvi Kapoor : తిరుమలలో ప్రియుడితో జాన్వీ కపూర్ పుట్టినరోజు పూజలు..

అందాల భామ జాన్వీ కపూర్ బర్త్ డే ఈరోజు (మార్చి 6) కావడంతో.. ఆమె ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబెర్స్ తో కలిసి తిరుమల వేంకటేశ్వరుడిని దర్శించుకున్నారు. జాన్వీ గత కొంతకాలంగా మహారాష్ట్ర మాజీ సీఎం సుశీల్‌కుమార్‌ షిండే మనవడు శిఖర్‌ పహారియాతో చనువుగా ఉండడం, ఎక్కడ చూసినా అతనితో కలిసి కనిపిస్తూ వస్తున్నారు. దీంతో వీరిద్దరూ ప్రేమలో ఉన్నారంటూ వార్తలు వినిపిస్తున్నాయి.

Women Health: పురుషుల కంటే మహిళలకు ఎందుకు ఎక్కువ తలనొప్పి వస్తుంది?

అధిక తలనొప్పిని మైగ్రేన్ అంటారు. కొన్నిసార్లు ఇది తల ఒక భాగంలో కనిపిస్తుంది. కొన్నిసార్లు ఇది మొత్తం తలని కప్పివేసేలా నొప్పి ఉంటుంది. ఒక అధ్యయనం ప్రకారం, పురుషుల కంటే స్త్రీలు ఎక్కువగా మైగ్రేన్‌కు గురవుతారట..నిపుణుల అభిప్రాయం ప్రకారం, మైగ్రేన్లు పురుషుల కంటే మహిళల్లో 3 రెట్లు ఎక్కువగా ఉంటాయని తేలింది. ఇది హార్మోన్ల మార్పుల కారణంగా ఉంటుందని పరిశోధకులు చెబుతున్నారు.

Brahma Yugam:ఓటీటీ లోకి వచ్చేస్తున్న మమ్ముట్టి 'భ్రమ యుగం'

మళయాళ మెగాస్టార్ మమ్ముట్టి ప్రధాన పాత్రలో నటించిన సినిమా భ్రమయుగం. ఈ సినిమా మలయాళంలో మంచి హిట్ ను అందుకుంది. అయితే తెలుగులో పెద్దగా చూడలేదు. చాలా థియేటర్లలో రెండు రోజులకే సినిమాను తీసేయాల్సి వచ్చింది. తెలుగు ప్రేక్షకుల ఆదరణ లేకపోవడంతో ఈ సినిమా మన దగ్గర ఫ్లాప్ ను మూటగట్టుకుంది. అయితే ఈ సినిమాను ఓటీటీలో త్వరలోనే చూడబోతున్నారు.


Tags:    

Similar News