'తుమ్మల'ను అవసరానికి వాడుకుని వదిలేశారు.. ఈటల సంచలన వ్యాఖ్యలు

తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో అటు అధికార పార్టీ అయిన బీఆర్‌ఎస్‌..

Update: 2023-08-28 02:49 GMT

తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో అటు అధికార పార్టీ అయిన బీఆర్‌ఎస్‌, ప్రతిపక్ష పార్టీలైన బీజేపీ, కాంగ్రెస్‌ నేతల మధ్య మాటల యుద్ధాలు కొనసాగుతున్నాయి. ఒకరిపై ఒకరు విమర్శల వర్షం కురిపించుకుంటున్నారు. ఇక మాజీ మంత్రి, బీఆర్‌ఎస్ నేత తుమ్మల నాగేశ్వరరావు విషయంలో బీజేపీ నేతల, ఎమ్మెల్యే ఈటల రాజేందర్‌ సంచలన వ్యాఖ్యలు చేశారు. బీజేపీలోకి తుమ్మలను ఆహ్వానిస్తామని అన్నారు. అయితే పాలేరు నియోజకవర్గ టికెట్‌ దక్కని తుమ్మలను కలిసి చర్చిస్తామని అన్నారు. తుమ్మల నాగేశ్వర్‌ రావును బీఆర్‌ఎస్‌ పార్టీ అవసరానికి వాడుకుకుని వదిలేశారని అన్నారని, ఆయనను బీజేపీలోకి రప్పించేందుకు ప్రయత్నిస్తామని అన్నారు. అయితే ఈటల రాజేందర్‌ వర్షన్‌ ఇలా ఉంటే.. తుమ్మల అనుచరులు మాత్రం కాంగ్రెస్‌లో చేరాలంటూ ఆయనపై ఒత్తిడి తీసుకువస్తున్నట్లు తెలుస్తోంది. అయితే ఖమ్మం జిల్లా ర్యాలీ తర్వాత తుమ్మల సైలెంట్‌ అయ్యారు. కేసీఆర్‌ పిలుపు కోసం 15 రోజుల పాటు వేచి ఉండి తదుపరి నిర్ణయం తీసుకుంటాననని ప్రకటించినట్లు సమాచారం. ఏదీ ఏమైనా వచ్చే ఎన్నికల్లో తాను బరిలో ఉండటం తప్పనిసరి అని, ఎన్నికల్లో తిరిగి నిలబడతాననని రెండు రోజుల కిందట నిర్వహించిన ర్యాలీలో తుమ్మల ప్రకటించారు.

తుమ్మల వస్తే ఖమ్మంలో పార్టీ బలోపేతం..

కాగా, తుమ్మల నాగేశ్వరరావు లాంటి వాళ్లు వస్తే ఖమ్మంలో తమ పార్టీ మరింత బలపడుతుందని బీజేపీ నేతలు భావిస్తుంటే.. కాంగ్రెస్‌ నేతలు కూడా అదే భావిస్తున్నారు. ఎలాగైనా తమ పార్టీలోకి రప్పించుకోవాలని కాంగ్రెస్‌ భారీ ప్రయత్నాలే చేస్తోంది. పార్టీ మారేట్టయితే ఆయన ఎక్కడి నుంచి పోటీ చేయాలని భావిస్తున్నారు..? ఒక వేళ పాలేరు నుంచి బరిలో ఉంటే పరిణామాలు ఎలా ఉంటాయన్నది త్వరలో తేలనుంది.

Tags:    

Similar News