బ్రేకింగ్ : సీఎం నివాసానికి ఎల్వీ

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడి నివాసానికి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎల్వీ సుబ్రహ్మణ్యం చేరకున్నారు. ఆయన చంద్రబాబుతో భేటీ కానున్నారు. రేపు మంత్రివర్గ సమావేశం ఉండటంతో ఈ [more]

;

Update: 2019-05-13 05:28 GMT
lv subrahmanyam chief secratary andrapradesh
  • whatsapp icon

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడి నివాసానికి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎల్వీ సుబ్రహ్మణ్యం చేరకున్నారు. ఆయన చంద్రబాబుతో భేటీ కానున్నారు. రేపు మంత్రివర్గ సమావేశం ఉండటంతో ఈ భేటీకి ప్రాధాన్యత సంతరించుకుంది. ఈ నెల 14వ తేదీన జరగబోయే మంత్రి వర్గ సమావేశానికి సంబంధించి అజెండాను కేంద్ర ఎన్నికల కమిషన్ కు పంపారు. కేంద్ర ఎన్నికల కమిషన్ నుంచి అనుమతి రావాల్సి ఉంది. అయితే రేపటి కేబినెట్ భేటీ జరుగుతుందా? లేదా? అన్న ఉత్కంఠ నెలకొంది. చంద్రబాబుతో ఎల్వీ సుబ్రహ్మణ్యం ఇంతవరకూ భేటీ కాలేదు. ఫోని తుఫాను సమీక్ష సమయంలోనూ అధికారులను పంపారు కానీ ఎల్వీ రాలేదు. ఇద్దరు పరస్పరం ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకున్న నేపథ్యంలో వీరి భేటీ ప్రాధాన్యత సంతరించుకుంది.

Tags:    

Similar News