ప్రభుత్వ అధికార లాంఛనాలతో గౌతమ్ రెడ్డి అంత్యక్రియలు పూర్తి

ఉదయగిరిలోని మెరిట్ ఇంజనీరింగ్ కళాశాల సమీపంలో గౌతమ్ రెడ్డి భౌతిక కాయానికి అంత్యక్రియలు నిర్వహించారు. సీఎం జగన్ మోహన్ ..

Update: 2022-02-23 07:18 GMT

నెల్లూరు : ఆంధ్రప్రదేశ్ దివంగత మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి అంత్యక్రియలు అశ్రు నయనాల మధ్య.. ప్రభుత్వ అధికార లాంఛనాలతో పూర్తయ్యాయి. బుధవారం ఉదయం 6 గంటల నుంచి నెల్లూరులోని ఆయన నివాసం నుంచి ఉదయగిరిలోని మేకపాటి రాజమోహన్ రెడ్డి కళాశాల వరకూ అంతిమయాత్ర సాగింది. నెల్లూరు నుంచి ఉదయగిరికి వెళ్లే మార్గంలో తమ ప్రియతమ నేతను కడసారి చూసేందుకు అభిమానులు, కార్యకర్తలు రోడ్డుకిరువైపులా బారులు తీరారు. గౌతమ్ రెడ్డిని తీసుకెళ్తున్న వాహనంపై పూలు జల్లుతూ.. అశ్రు నయనాలతో ఆయనకు తుది వీడ్కోలు పలికారు.

ఉదయగిరిలోని మెరిట్ ఇంజనీరింగ్ కళాశాల సమీపంలో గౌతమ్ రెడ్డి భౌతిక కాయానికి అంత్యక్రియలు నిర్వహించారు. సీఎం జగన్ మోహన్ రెడ్డి దంపతులు గౌతమ్ రెడ్డి అంత్యక్రియలకు హాజరయ్యారు. గౌతమ్ రెడ్డి తనయుడు కృష్ణార్జున్ రెడ్డి.. మధ్యాహ్నం 12 గంటలకు పట్టరాని దుఃఖంతో తన తండ్రి చితికి నిప్పంటించారు. అనంతరం పోలీసులు మూడుమార్లు గాల్లోకి కాల్పులు జరిపి.. గౌతమ్ రెడ్డికి తుది వీడ్కోలు పలుకుతూ వందనం చేశారు. ప్రభుత్వ అధికార లాంఛనాలతో మంత్రి గౌతమ్ రెడ్డి అంత్యక్రియలు పూర్తయ్యాయి. అంత్యక్రియల సమయంలో గౌతమ్ రెడ్డి కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపించారు. భార్య శ్రీకీర్తి, తల్లి మణిమంజరిని ఓదార్చడం ఎవరి తరం కాలేదు. సీఎం జగన్ దంపతులను గౌతమ్ రెడ్డి కుటుంబ సభ్యులను ఓదార్చారు.


Tags:    

Similar News