మంకీపాక్స్ టెన్షన్.. వాటికి మూడు వారాలు దూరంగా ఉండాల్సిందే..!

మంకీ పాక్స్ ఇన్ఫెక్షన్ సోకిన వారు మూడు వారాల పాటు పెంపుడు జంతువులకు కూడా దూరంగా ఉండాలని సూచించారు. పెంపుడు..

Update: 2022-05-30 10:59 GMT

హైదరాబాద్ : మంకీపాక్స్‌ పాజిటివ్‌ కేసుల సంఖ్య ప్రపంచ దేశాలను ఎంతగానో ఇబ్బంది పెడుతూ ఉంది. ప్రజారోగ్యానికి మంకీపాక్స్‌ ముప్పు పొంచి ఉందని డబ్ల్యూహెచ్‌వో ఆందోళన వ్యక్తం చేసింది. ప్రపంచ వ్యాప్తంగా వైరస్‌ కేసులు క్రమంగా పెరుగుతున్నాయని, ఇప్పటివరకు 23 దేశాల్లో 257 కేసులు నమోదు అయినట్టు ప్రపంచ ఆరోగ్య సంస్థ వెల్లడించింది. ఇంకా 120 మందిలో లక్షణాలను గుర్తించామని.. కొన్ని దేశాల్లో బయటపడిన మంకీపాక్స్‌ వేగంగా వ్యాప్తిచెందుతున్నదని స్పష్టం చేసింది. ప్రభుత్వాలు కూడా మంకీపాక్స్‌ను సీరియస్‌గా తీసుకుని.. వెంటనే వ్యాక్సిన్లను సమకూర్చుకోవాలని తెలిపింది. మంకీపాక్స్‌పై అందరికి అవగాహన కల్పించాలని, వ్యాధి లక్షణాలను తెలియజేయాలని తెలిపింది. వైరస్ సమూహాలకు వ్యాప్తి చెందితే.. చిన్నారులు, రోగ నిరోధక శక్తి లేనివారు, దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్నవారిపై తీవ్ర ప్రభావం చూపుతుందని హెచ్చరించింది.

మంకీ పాక్స్ ఇన్ఫెక్షన్ సోకిన వారు మూడు వారాల పాటు పెంపుడు జంతువులకు కూడా దూరంగా ఉండాలని సూచించారు. పెంపుడు జంతువుల ద్వారా మంకీ పాక్స్ వ్యాప్తి చెందుతుందనే హెచ్చరికల నేపథ్యంలో వైద్యులు ఈ దిశగా మార్గదర్శకాలు జారీ చేశారు. చాలా మంది మంకీపాక్స్ రోగులు జ్వరం, శరీర నొప్పులు, చలి, అలసటను మాత్రమే అనుభవిస్తున్నారు.. మరింత తీవ్రమైన అనారోగ్యాలు ఉన్న వ్యక్తులకు ముఖం, చేతులపై దద్దుర్లు వస్తున్నాయి. అవి శరీరంలోని ఇతర భాగాలకు వ్యాపిస్తున్నాయి. ఎలుకలు, కోతులు వంటి జంతువులలో కనిపించే వైరస్ వల్ల ఈ ఇన్ఫెక్షన్ వస్తుంది. సాధారణంగా, ఇది మధ్య, పశ్చిమ ఆఫ్రికాకు చెందినది. అయితే ఇటీవల, UK, US, ఇజ్రాయెల్ మరియు ఫ్రాన్స్‌తో సహా ఇతర దేశాలలో ఈ కేసులు కనిపించాయి.


Tags:    

Similar News