ఉలుకేల...? కులుకేల...?

Update: 2018-10-07 05:00 GMT

ఏపీలో జరుగుతున్న ఐటి శాఖ దాడులపై టిడిపి నేతల విమర్శల పర్వం మరింత తీవ్రం కావడం గమనార్హం. ప్రతి అంశాన్ని టిడిపికి అనుకూలంగా మలుచుకోవాలన్న ఎత్తుగడల నేపథ్యంలో ఆదాయపు పన్ను శాఖ దాడులను రాజకీయ లబ్ధికి పక్కా ప్లాన్ తో వినియోగించేస్తుంది టిడిపి. ఈ నేపథ్యంలో విమర్శల పదును పెంచింది తెలుగుదేశం. పెట్టుబడులు రాష్ట్రానికి రాకుండా పారిశ్రామికవేత్తలు భయాందోళనలకు గురి కావాలనే మోడీ సర్కార్ ఈ చర్యలకు దిగుతుందని దాడి మొదలు పెట్టింది. పెట్టుబడులు అన్ని గుజరాత్ తరలించుకుని వెళ్ళెందుకు కేంద్రం ఈ కుట్ర చేస్తుందన్న గగ్గోలు తమ్ముళ్ళు గల్లీ గల్లీ లో చెబుతూ ఇదంతా ఢిల్లీ స్కెచ్ అంటున్నారు.

టిడిపి పై దుమ్మెత్తిపోస్తున్న ...

టిడిపి దాడిని సమర్ధవంతంగా తిప్పికొడుతున్నారు బిజెపి నేత. దాడులు వ్యాపార వర్గాలపై జరుగుతుంటే అధికారపార్టీకి ఎందుకు ఆందోళన అన్నది కమల నాథుల ప్రశ్న. గుమ్మడికాయ దొంగ అంటే ఎందుకు ఉలిక్కి పడుతున్నారని దాడులకు సహకరించమని సెక్యూరిటీ ఇవ్వమని దొంగలకు రక్షణ కల్పించడం చిత్రంగా ఉందంటున్నారు వారు. వేలకోట్ల రూపాయల అవినీతికి పాల్పడటం వల్లే అధికార పార్టీ వణికిపోతుందని విమర్శిస్తున్నారు బిజెపి నేతలు. అక్రమ సొమ్ము వెనకేసిన వారిని జాగ్రత్త పడమని ముఖ్యమంత్రే హెచ్చరించడం ఎక్కడా చూడలేదంటున్నారు కమలం పార్టీ నాయకులు. ఇలా ఒకరిపై మరొకరు ఐటి దాడులపై విమర్శలు, ఆరోపణలు సాగించుకోవడం సర్వత్రా చర్చకు దారితీస్తుంది.

Similar News