బాబుకు డిప్యూటీ సీఎం మరో సవాల్

ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ ముఖ్యమంత్రి నారాయణ స్వామి తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబుకు సవాల్ విసిరారు. తాను అవినీతి చేసినట్లు నిరూపిస్తూ పదవికి రాజీనామా చేస్తానని చెప్పారు. తాను [more]

;

Update: 2021-08-27 06:59 GMT

ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ ముఖ్యమంత్రి నారాయణ స్వామి తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబుకు సవాల్ విసిరారు. తాను అవినీతి చేసినట్లు నిరూపిస్తూ పదవికి రాజీనామా చేస్తానని చెప్పారు. తాను అవినీతి చేసినట్లు కాణిపాకం ఆలయంలో ప్రమాణం చేస్తారా? అని నారాయణస్వామి అన్నారు. నిరూపించలేకపోతే చంద్రబాబు రాజకీయాల నుంచి తప్పుకుంటారా? అని నారాయణ స్వామి ప్రశ్నించారు. తనపై చేస్తున్న అవినీతి ఆరోపణలపై తాను సీబీఐ విచారణకు సిద్ధమని నారాయణస్వామి అన్నారు.

Tags:    

Similar News