ఆ ఓవరే కొంపముంచింది

న్యూజిలాండ్ గెలిచింది. తొలి టీ 20లో భారత్ ఓటమి పాలయింది. చివరి ఓవర్ ఓటమికి కారణమయింది.

Update: 2023-01-28 02:05 GMT

భారత్ ఓటమికి కారణం చివరి ఓవర్. డెత్ ఓవర్ లలో మరోసారి భారత్ బౌలర్లు విఫలమయ్యారు. అర్షదీప్ ఎప్పటిలాగే నో బాల్ వేశాడు. చివరి ఓవర్ లో 23 పరుగులు ఇచ్చాడు. 21 పరుగులతోనే భారత్ ఓటమి పాలయింది. టాస్ గెలిచిన భారత్ బౌలింగ్ ను ఎంచుకుంది. తొలుత న్యూజిలాండ్ బౌలర్లను కట్టడి చేసినా తర్వాత పరుగుల వరద పారింది. న్యూజిలాండ్ 20 ఓవర్లలో ఆరు వికెట్లు కోల్పోయి 176 పరుగులు చేసింది. కాన్వే 52, ఫిన్ ఆలెన్ 35, డారిల్ మిచెల్ 59 పరుగులు చేశారు.

వరసబెట్టి...
177 లక్ష్యంతో బరిలోకి దిగిన భారత్ ఆదిలోనే ఇషాన్ కిషన్ వికెట్ కోల్పోయింది. గిల్, త్రిపాఠి కూడా వరసగా పెవిలియన్ బాట పట్టారు. అనంతరం క్రీజులోకి వచ్చిన సూర్యకుమార్ యాదవ్, హార్ధిక్ పాండ్యాలు నిలదొక్కుకునేసరికి స్కోరు కొంత పరవాలేదనిపించింది. అయితే సూర్యకుమార్ అవుట్ కావడం, వెనువెంటనే హార్ధిక్ పాండ్యా కూడా అవుట్ కావడంతో ఇక భారత్ ఓటమి ఖాయమనిపించింది. అయితే వాషింగ్టన్ సుందర్ అర్థశతకాన్ని 25 పరుగుల్లో చేశాడు. అయినా అప్పటికే భారత్ ఓటమి ఖాయమయింది. రన్ రేట్ పెరిగి పోవడంతో రాంచీలో తొలి టీ 20లో భారత్ ఓటమి మూటగట్టుకుంది. వరసగా విజయాలను సాధిస్తున్న భారత్ కు న్యూజిలాండ్ బ్రేక్ వేసినట్లయింది.


Tags:    

Similar News