టెన్నిస్ నుంచి రిటైర్ అవుతోన్న సానియా మీర్జా ?

ప్రముఖ టెన్నిస్ క్రీడాకారిణి సానియా మీర్జా.. టెన్నిస్ క్రీడ నుంచి త్వరలోనే రిటైర్ కానుంది. 2022 సీజన్ తనకు

Update: 2022-01-19 09:48 GMT

ప్రముఖ టెన్నిస్ క్రీడాకారిణి సానియా మీర్జా.. టెన్నిస్ క్రీడ నుంచి త్వరలోనే రిటైర్ కానుంది. 2022 సీజన్ తనకు చివరిదని ప్రకటించి ఆ విషయాన్ని స్పష్టం చేసింది. ఆస్ట్రేలియన్ ఓపెన్ లో ఓటమి అనంతరం సానియా ఈ విషయాన్ని వెల్లడించింది. సానియా మీర్జా మాట్లాడుతూ.. "ఇది నా చివరి సీజన్ అని నేను నిర్ణయించుకున్నాను. నేను ఒక వారం నుంచి ఈ టోర్నీలో ఆడుతున్నాను. నేను మొత్తం సీజన్‌లో ఆడగలనో లేదో తెలియదు. కానీ నేను మొత్తం సీజన్‌లో ఉండాలనుకుంటున్నాను" అని పేర్కొంది.

సానియా, ఉక్రెయిన్ భాగస్వామి నదియా కిచ్నోక్ ఆస్ట్రేలియన్ ఓపెన్ తొలి రౌండ్‌లో ఓటమిని చవిచూడక తప్పలేదు. స్లోవేనియాకు చెందిన తమరా జిదాన్‌సెక్‌-కాజా జువాన్‌ జోడీ 4-6, 6-7(5)తో గంటా 37 నిమిషాల్లో ఓటమి చవిచూశారు. ప్రస్తుతం సానియా.. అమెరికాకు చెందిన రాజీవ్ రామ్‌తో కలిసి ఈ గ్రాండ్‌స్లామ్ మిక్స్‌డ్ డబుల్స్‌లో పాల్గొంటుంది. సానియా కెరీర్ లో ఇప్పటి వరకూ ఆరు గ్రాండ్ స్లామ్ టైటిల్స్ ను సాధించింది. మూడు మహిళల డబుల్స్, మూడు మిక్స్ డ్ డబుల్స్ లో ఈ టైటిల్స్ ను గెలుచుకుంది. 2009లో ఆస్ట్రేలియన్ ఓపెన్ మిక్స్‌డ్ డబుల్స్‌లో, 2012లో ఫ్రెంచ్ ఓపెన్, 2014లో యూఎస్ ఓపెన్. మహిళల డబుల్స్‌లో 2015లో వింబుల్డన్, యూఎస్ ఓపెన్, 2016లో ఆస్ట్రేలియన్ ఓపెన్‌లో ట్రోఫీలు సాధించింది.





Tags:    

Similar News