సమ్మెపై టెన్షన్…..టెన్షన్
ఆర్టీసీ సమ్మెపై ఇవ్వాళ హైకోర్టులో విచారణ జరుగనుండడంతో ఇటు ఆర్టీసీ కార్మికుల్లో, అటు ఆర్టీసీ యాజమాన్యంలోనూ టెన్షన్ నెలకొంది. కోర్టు మళ్లీ ఎక్కడ ముట్టికాయలు వేస్తుందోనని భయం [more]
ఆర్టీసీ సమ్మెపై ఇవ్వాళ హైకోర్టులో విచారణ జరుగనుండడంతో ఇటు ఆర్టీసీ కార్మికుల్లో, అటు ఆర్టీసీ యాజమాన్యంలోనూ టెన్షన్ నెలకొంది. కోర్టు మళ్లీ ఎక్కడ ముట్టికాయలు వేస్తుందోనని భయం [more]
ఆర్టీసీ సమ్మెపై ఇవ్వాళ హైకోర్టులో విచారణ జరుగనుండడంతో ఇటు ఆర్టీసీ కార్మికుల్లో, అటు ఆర్టీసీ యాజమాన్యంలోనూ టెన్షన్ నెలకొంది. కోర్టు మళ్లీ ఎక్కడ ముట్టికాయలు వేస్తుందోనని భయం పట్టుకుంది. కోర్టు సూచించినట్లు శనివారం ఆర్టీసీ యాజమాన్యం జేఏసీ నేతలను చర్చలకు పిలిచింది. కాని ఆ చర్చలు అసంపూర్తిగానే ముగిశాయి. ఆర్టీసీ జేఏసీ నేతలు అన్ని డిమాండ్లపై చర్చ జరపాలని పట్టుబట్టగా ఆర్టీసీ యాజమాన్యం మాత్రం కోర్టు సూచించిన 21 డిమాండ్లపైనే తాము చర్చిస్తామని పట్టుబట్టారు. కోర్టు ఎక్కడ కూడా 21డిమాండ్లపై చర్చించాలని సూచించలేదని జేఏసీ నాయకులు స్పష్టం చేశారు. మొత్తానికి వీరి మధ్య చర్చలు జరగలేదు. ఇవ్వాళ కోర్టులో విచారణ ఉండడంతో మరి కోర్టు ఏం డైరెక్షన్ ఇస్తుందోనని అందరూ ఎదురు చూస్తున్నారు.