ఎక్కడికక్కడ ప్రతిపక్ష పార్టీల నేతలు అరెస్ట్

ఇంటర్ ఫలితాల్లో అవకతవకలను నిరసిస్తూ ‘ఇంటర్ బోర్డు ముట్టడి’కి పిలుపునిచ్చిన తెలంగాణ ప్రతిపక్ష పార్టీల నేతలను పోలీసులు ఎక్కడికక్కడ అడ్డుకుంటున్నారు. ఫలితాల్లో అవకతవకల కారణంగా విద్యార్థులు తీవ్రంగా [more]

Update: 2019-04-29 06:38 GMT

ఇంటర్ ఫలితాల్లో అవకతవకలను నిరసిస్తూ ‘ఇంటర్ బోర్డు ముట్టడి’కి పిలుపునిచ్చిన తెలంగాణ ప్రతిపక్ష పార్టీల నేతలను పోలీసులు ఎక్కడికక్కడ అడ్డుకుంటున్నారు. ఫలితాల్లో అవకతవకల కారణంగా విద్యార్థులు తీవ్రంగా నష్టపోతున్నారని, ఫలితాల అవకతవకల వెనుక ఉన్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలనే డిమాండ్ తో కాంగ్రెస్, టీడీపీ, తెలంగాణ జన సమితి. సీపీఐ పార్టీలు ఆందోళనకు పిలుపునిచ్చాయి. దీంతో ఈ కార్యక్రమాని అడ్డుకునేందుకు పోలీసులు ఎక్కడికక్కడ ప్రతిపక్ష నేతలను అరెస్ట్ చేస్తున్నారు. నిన్నటి నుంచి పలువురు నేతలను ముందస్తుగా అరెస్ట్ చేశారు. ప్రొ.కోదండరాం, ఎల్.రమణ, షబ్బీర్ అలీ, పొన్నం ప్రభాకర్, జీవన్ రెడ్డి, ఎమ్మెల్సీ రాంచందర్ రావు, అంజన్ కుమార్ యాదవ్ తదితరులను పోలీసులు తెల్లవారు జాము నుంచే హౌజ్ అరెస్ట్ చేసి వారి ఇళ్ల వద్ద భారీగా పోలీసులను మొహరించారు. జిల్లాల నుంచి ఇంటర్ బోర్డు వద్ద ఆందోళనకు బయలుదేరిన వివిధ పార్టీల నేతలను సైతం మార్గమధ్యలోనే అరెస్ట్ చేశారు.

Tags:    

Similar News