టీటీడీ వ్యవహారాన్ని గవర్నర్ దృష్టికి తీసుకెళ్తాం

తిరుమల తిరుపతి దేవస్థానం స్వయంప్రతిపత్తి సంస్థగా ఉండాలని టీడీపీ సీనియర్ నేత, పీఏసీ ఛైర్మన్ పయ్యావుల కేశవ్ కోరారు. టీటీడీని పీఏసీ పరిధిలోకి తీసుకురావాలన్న ప్రభుత్వ నిర్ణయాన్ని [more]

Update: 2021-07-06 04:00 GMT

తిరుమల తిరుపతి దేవస్థానం స్వయంప్రతిపత్తి సంస్థగా ఉండాలని టీడీపీ సీనియర్ నేత, పీఏసీ ఛైర్మన్ పయ్యావుల కేశవ్ కోరారు. టీటీడీని పీఏసీ పరిధిలోకి తీసుకురావాలన్న ప్రభుత్వ నిర్ణయాన్ని పయ్యావుల కేశవ్ తప్పుపట్టారు. ప్రభుత్వ జోక్యం అందులో ఉండకూడదని ఆయన అన్నారు. ఈ మేరకు పబ్లిక్ అకౌంట్స్ కమిటీ తీసుకున్న నిర్ణయాలను గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్ కు తెలియజేస్తామని పయ్యావుల కేశవ్ తెలిపారు. టీటీడీని ధార్మిక సంస్థగా చూస్తూ ప్రభుత్వ పెత్తనం లేకుండా చేయాలన్నది తమ సిఫార్సు అని పయ్యావుల కేశవ్ తెలిపారు.

Tags:    

Similar News