పీఎం కిసాన్ 10వ విడత నిధులు విడుదల
పీఎం కిసాన్ సమ్మాన్ నిధి 10వ విడత నిధులతో పాటు.. 351 రైతు ఉత్పత్తిదారుల సంఘాలకు రూ.14 కోట్ల నిధిని
రైతులకు లబ్ధి చేకూర్చేందుకు కేంద్రం తీసుకొచ్చిన పీఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకంలో భాగంగా.. నేడు 10వ విడత నిధులను ప్రధాని నరేంద్ర మోదీ విడుదల చేశారు. ఒక్క క్లిక్ తో 10 కోట్లమందికి పైగా రైతుల ఖాతాల్లో రూ.21 వేల కోట్లను జమచేశారు ప్రధాని. ఈ సందర్భంగా ప్రధాని మోదీ మాట్లాడుతూ.. 2018 సంవత్సరం నుంచి ఇప్పటి వరకూ రూ.1.61 లక్షల కోట్ల మేర రైతులకు సహాయం అందించినట్లు తెలిపారు.
Also Read : షేక్ పేట్ ఫ్లై ఓవర్ ను ప్రారంభించిన కేటీఆర్
పీఎం కిసాన్ సమ్మాన్ నిధి 10వ విడత నిధులతో పాటు.. 351 రైతు ఉత్పత్తిదారుల సంఘాలకు రూ.14 కోట్ల నిధిని కూడా విడుదల చేశారు ప్రధాని. ఈ పథకం కింద 1.24 లక్షల మందికి పైగా రైతులకు లబ్ది చేకూరనుంది. కాగా.. పీఎం కిసాన్ పథకంలో భాగంగా కేంద్ర ప్రభుత్వం ఏడాదిలో మూడు సార్లు చొప్పున మొత్తం రూ.6 వేలను అందిస్తోంది. కొత్త సంవత్సరం మొదటి రోజునే రైతుల ఖాతాల్లోకి నగదు జమ అవ్వడంతో.. రైతన్నలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
Also Read : దీప్తితో బ్రేకప్ పై స్పందించిన షన్ను !