అమలాపురంలో హై అలెర్ట్… ఉద్రిక్తత
అమలాపురంలో పోలీసులు హైఅలెర్ట్ ప్రకటించారు. అమలాపురంలో 600 మంది అదనపు పోలీసు బలగాలను దించారు. కోనసీమ అంతటా 144 సెక్షన్ ను విధించారు. అంతర్వేది రధం దగ్దం, [more]
అమలాపురంలో పోలీసులు హైఅలెర్ట్ ప్రకటించారు. అమలాపురంలో 600 మంది అదనపు పోలీసు బలగాలను దించారు. కోనసీమ అంతటా 144 సెక్షన్ ను విధించారు. అంతర్వేది రధం దగ్దం, [more]
అమలాపురంలో పోలీసులు హైఅలెర్ట్ ప్రకటించారు. అమలాపురంలో 600 మంది అదనపు పోలీసు బలగాలను దించారు. కోనసీమ అంతటా 144 సెక్షన్ ను విధించారు. అంతర్వేది రధం దగ్దం, అనంతరం బీజేపీ దాని అనుబంధ సంస్థల నేతలపై కేసులు నమోదవ్వడంతో బీజేపీ చలో అమలాపురం కార్యక్రమానికి పిలపునిచ్చింది. అమలాపురం ఆర్డీవో కార్యాలయాన్ని ముట్టడించాలని సోము వీర్రాజు పిలుపు నిచ్చారు. ఇప్పటికే అమలాపురానికి కొందరు బీజేపీ నేతలు చేరుకోవడంతో పరిస్థిితి ఉద్రిక్తంగా మారింది. దీంతో అమలాపురంలో షాపులను వ్యాపారులు స్వచ్ఛందంగా బంద్ చేశారు. బీజేపీ నేతలను ఎక్కడికక్కడ అరెస్ట్ చేసినా అనేక మంది అమలాపురం చేరుకుంటారని భావించి పోలీసులు హైఅలెర్ట్ ప్రకటించారు.