పాకిస్థాన్ కు మోడీ స్ట్రాంగ్ వార్నింగ్

పుల్వామాలో దాడికి పాల్పడిన వారిని ఎట్టి పరిస్థితుల్లో వదిలిపెట్టమని.. పాకిస్థాన్ భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని ప్రధాని నరేంద్ర మోడీ తీవ్రంగా హెచ్చరించారారు. పాలెం విమానాశ్రయంలో ఉగ్రదాడిలో [more]

;

Update: 2019-02-15 06:17 GMT
narendra modi on pulwama terror attack
  • whatsapp icon

పుల్వామాలో దాడికి పాల్పడిన వారిని ఎట్టి పరిస్థితుల్లో వదిలిపెట్టమని.. పాకిస్థాన్ భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని ప్రధాని నరేంద్ర మోడీ తీవ్రంగా హెచ్చరించారారు. పాలెం విమానాశ్రయంలో ఉగ్రదాడిలో మృతి చెందిన అమరులకు ఆయన నివాళులర్పించారు. ఈ సందర్భంగా మీ మోడీ మాట్లాడుతూ… అమరుల కుటుంబాలకు అండగా నిలుస్తామన్నారు. సైనికుల ధైర్యసహాసాలపై జాతికి నమ్మకముందని, అమరుల త్యాగాలు వృధా పోనివ్వమన్నారు. ఇలాంటి దాడులతో బెదిరించాలనుకునే పాక్ కుట్రలు ఫలించవన్నారు. ఉగ్రవాదులు, వారి వెనకున్న వారు పెద్ద సాహసమే చేశారని, వారిని వదిలిపెట్టమని హెచ్చరించారు. ఈ సమయంలో రాజకీయాలు వద్దని, ఇది చాలా సున్నితమైన అంశమని ఆయన పేర్కొన్నారు. అధికారంలో ఉన్నా.. విపక్షంలో ఇలాంటి దాడులను ఖండించాల్సిందేనని స్పష్టం చేశారు.

Tags:    

Similar News