వైసీపీ ఎందుకు పోటీ చేయడం లేదు?

Update: 2018-11-12 13:44 GMT
వైసీపీ ఎందుకు పోటీ చేయడం లేదు?
  • whatsapp icon

తెలంగాణలో వైసీపీ ఎందుకు పోటీ చేయడంలేదో చెప్పాలని ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు రఘువీరారెడ్డి ప్రశ్నించారు. తెలంగాణలో కాంగ్రెస్, టీడీపీ పొత్తు బహిరంగ రహస్యమేనన్నారు. కానీ వైసీపీ రహస్య ఒప్పందాలు, చీకటి ఒప్పందాలను కుదుర్చుకుంటోందని తెలిపారు. కాంగ్రెస్ తో 18 పార్టీలు కలసి ప్రయాణం సాగిస్తున్నాయని తెలిపారు. జగన్ పార్టీ తెలంగాణలో ఎందుకు పోటీ చేయడం లేదో ప్రజలకు వివరించాలని ఆయన కోరారు. ఏపీలో పొత్తుపై ఇంకా ఒక స్పష్టత రాలేదన్నారు. ఎన్నికలకు సమయం ఉన్నందున పొత్తుల విషయం ఇప్పుడే చర్చించడం అనవసరమని రఘువీరా అభిప్రాయపడ్డారు.

Similar News