అగ్ని ప్రమాదానికి కారణమదేనా..?
ఒక వ్యక్తి అలసత్వం వందలాది కుటుంబాలను రోడ్డు మీద పడేసింది. కోట్ల రూపాయల ఆస్థి నష్టం చేసింది. వేలాది మంది జీవనోపాధి కోల్పోయేలా చేసింది. ఎంతో చరిత్ర [more]
ఒక వ్యక్తి అలసత్వం వందలాది కుటుంబాలను రోడ్డు మీద పడేసింది. కోట్ల రూపాయల ఆస్థి నష్టం చేసింది. వేలాది మంది జీవనోపాధి కోల్పోయేలా చేసింది. ఎంతో చరిత్ర [more]
ఒక వ్యక్తి అలసత్వం వందలాది కుటుంబాలను రోడ్డు మీద పడేసింది. కోట్ల రూపాయల ఆస్థి నష్టం చేసింది. వేలాది మంది జీవనోపాధి కోల్పోయేలా చేసింది. ఎంతో చరిత్ర కలిగిన నాంపల్లి ఎగ్జిబీషన్ ను బుగ్గిపాలు చేసింది ఒక వ్యక్తి కాల్చి పారేసిన సిగరేటేనని అధికారులు నిర్ధిరించారు. ఎగ్జిబీషన్ సొసైటీ గౌరవాధ్యక్షుడు, ఎమ్మెల్యే ఈటెల రాజేందర్ కూడా ఈ విషయాన్ని స్పష్టం చేశారు. నిన్న రాత్రి ఎగ్జిబీషన్ గ్రౌండ్ లో జరిగిన ప్రమాదంపై ఆయన మీడియాతో మాట్లాడుతూ… ఓ షాపు వద్ద కాల్చిపారేసిన సిగరేట్ వల్లే ప్రమాదం జరిగిందన్నారు. 79 ఏళ్ల చరిత్రలో ఎప్పుడూ ఇంత భారీ అగ్నిప్రమాదం జరగలేదని, మొత్తం 300 దుకాణాలు దగ్ధమయ్యాయన్నారు. నష్టపోయిన వ్యాపారులను ఆదుకుంటామని హామీ ఇచ్చారు. గ్రౌండ్ లో ఫైరింజన్ సిబ్బంది అలెర్ట్ గానే ఉన్నారని… అయనా మంటలు ఆర్పడం సాధ్యం కాలేదన్నారు. ఇక నుంచి ఇటువంటి ప్రమాదాలు జరగకుండా కచ్చితమైన జాగ్రత్తలు తీసుకుంటామన్నారు.