విశాఖ స్టీల్ ప్లాంట్ విషయంలో అదే అసలు ప్లాన్

విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రయివేటీకరణపై అందరూ ఉద్యమించాలని సినీనటుడు శివాజీ అన్నారు. ఆయన స్టీల్ ప్లాంట్ కార్మికులకు సంఘీభావం తెలిపారు. ప్రభుత్వాలు ప్రజలను మోసం చేయడమే పనిగా [more]

Update: 2021-02-18 05:14 GMT

విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రయివేటీకరణపై అందరూ ఉద్యమించాలని సినీనటుడు శివాజీ అన్నారు. ఆయన స్టీల్ ప్లాంట్ కార్మికులకు సంఘీభావం తెలిపారు. ప్రభుత్వాలు ప్రజలను మోసం చేయడమే పనిగా పెట్టుకున్నాయని శివాజీ ఆరోపించారు. విశాఖ స్టీల్ ప్లాంట్ కు ఉన్న రెండు లక్షల కోట్ల విలువైన 26 వేల ఎకరాలను కాజేయడానికే ప్రయివేటీకరణ ప్రతిపాదనను ముందుకు తెచ్చారన్నారు. ప్రయివేటీకరణ జరిగితే అది కేంద్ర , రాష్ట్ర ప్రభుత్వాలదే బాధ్యత అని శివాజీ హెచ్చరించారు. ఉద్యమంలో అందరూ కలసి వచ్చి విశాఖ ఉక్కును కాపాడుకోవాలని శివాజీ పిలుపునిచ్చారు.

Tags:    

Similar News