డబ్బులివ్వలేదని... రైల్లో పాములొదిలేశారు..!

ఓ నలుగురు పాములు పట్టేవాళ్లు... ఓ రైలెక్కారు. బుట్టల్లోంచి పాములు తీశారు. కాసేపు ఆడిరచారు. రైల్వే ప్యాసింజర్లు కూడా ఎంజాయ్‌ చేశారు. తర్వాత ఒక్కో సీటు దగ్గరకు వెళ్లి డబ్బులడగడం ప్రారంభించారు. కొంతమంది ఇచ్చారు. మరికొంతమంది ప్రయాణికులు డబ్బులివ్వడానికి నిరాకరించారు. దీంతో పాములవాళ్లకు కోపం వచ్చింది. తమతో తెచ్చిన పాములను కంపార్ట్‌మెంట్లో వదిలేశారు. ఇక స్టార్ట్‌ అయింది... రచ్చ. ప్యాసింజర్లంతో భయంతో అప్పర్‌ బెర్త్‌ ఎక్కడానికి నానా హైరానా పడ్డారు.

Update: 2023-09-10 10:59 GMT

చంబల్ ఎక్సప్రెస్ లో గందరగోళం 

ఓ నలుగురు పాములు పట్టేవాళ్లు... ఓ రైలెక్కారు. బుట్టల్లోంచి పాములు తీశారు.. ఆడించారు. కాసేపు రైల్వే ప్యాసింజర్లు కూడా ఎంజాయ్‌ చేశారు. తర్వాత ఒక్కో సీటు దగ్గరకు వెళ్లి డబ్బులడగడం ప్రారంభించారు. కొంతమంది ఇచ్చారు. మరికొంతమంది ప్రయాణికులు డబ్బులివ్వడానికి నిరాకరించారు. దీంతో పాములవాళ్లకు కోపం వచ్చింది. తమతో తెచ్చిన పాములను కంపార్ట్‌మెంట్లో వదిలేశారు. ఇక స్టార్ట్‌ అయింది... రచ్చ. ప్యాసింజర్లంతో భయంతో అప్పర్‌ బెర్త్‌ ఎక్కడానికి నానా హైరానా పడ్డారు. ఈ విషయం పోలీసులకు తెలిసి... వాళ్లు తర్వాత స్టేషన్‌లో కంపార్ట్‌మెంట్లోకి వచ్చేలోగా పాములు పట్టేవాళ్లు.. తాము వదిలేసిన పాముల్ని తీసుకుని పరారయ్యారు.

హౌరా నుంచి గ్వాలియర్‌ మధ్య ప్రయాణించే చంబల్‌ ఎక్స్‌ప్రెస్‌లో శనివారం మధ్యాహ్నం కొంతమంది పాములు పట్టేవాళ్లు ఎక్కారు. బండా స్టేషన్‌లో ఎక్కిన వాళ్లు గంట తర్వాత వచ్చే మహోబా స్టేషన్‌లో దిగారు. కానీ ఆ గంటలోనే అసలైన గొడవంతా జరిగింది. బుట్టలు తీసి, బూరలు ఊదుతూ కాసేపు ప్రయాణికులను అలరించారు. తర్వాత సీట్ల దగ్గరకు వెళ్లి డబ్బులు అడగడం ప్రారంభించారు. కొంతమంది డబ్బులిచ్చినా, మరికొంతమంది ఇవ్వబోమన్నారు. దీంతో ఆ పాముల పోషగాళ్లు ప్యాసింజర్లతో వాదనకు దిగారు. అది కాస్తా శృతి మించి, చివరకు తమ బుట్టలో ఉన్న పాములను కంపార్ట్‌మెంట్లో వదిలేశారు. అంతే... అంతా గందరగోళం. ప్రయాణికులు అరుస్తూ అప్పర్‌బెర్త్‌ వైపు పరుగెత్తారు. పెద్ద వయసు వాళ్లు, పిల్లలు చాలా ఇబ్బంది పడ్డారు. ఓ ప్రయాణికుడు పోలీస్‌ కంట్రోల్‌ రూమ్‌కి ఫోన్‌ చేయడంతో.. తర్వాత స్టేషన్‌ (మహోబా)లో తాము రైల్‌ ఎక్కి పరిస్థితిని చక్కదిద్దుతామని పోలీసులు హామీ ఇచ్చారు. విషయం తెలిసి, పాములు పట్టేవాళ్లు తమ పాముల్ని వెతికి పట్టుకుని, పలాయనం చిత్తగించారు. ఎందుకైనా మంచిదని కంపార్ట్‌మెంట్‌ అంతా వెతికి, పాములేవీ లేవని నిర్ధారించుకుని, పోలీసులు ట్రెయిన్‌ దిగారు. ప్రయాణికుల్ని బెదిరించిన ఆ పాములు పట్టేవాళ్లను పట్టుకుంటామని ప్రభుత్వ రైల్వే పోలీస్‌ స్టేషన్‌ ఇన్‌ ఛార్జి అఖిలేష్‌ ప్రతాప్‌ సింగ్‌ చెప్పారు.

Tags:    

Similar News