రాష్ట్రాల్లో లీడర్ షిప్ ఏదీ?
సంస్థాగత ఎన్నికలు పూర్తయ్యేంత వరకూ సోనియాగాంధీ కాంగ్రెస్ తాత్కాలిక అధ్యక్షురాలిగా కొనసాగేందుకు అంగీకరించారు.
సంస్థాగత ఎన్నిలు పూర్తయ్యేంత వరకూ సోనియాగాంధీ కాంగ్రెస్ తాత్కాలిక అధ్యక్షురాలిగా కొనసాగేందుకు అంగీకరించారు. తొలుత సోనియా రాజీనామాకు సిద్ధపడ్డారు. నేతలు బతిమాలడంతో సంస్థాగత ఎన్నికలు పూర్తయ్యేంత వరకూ తాను తాత్కాలిక అధ్యక్షురాలిగా కొనసాగుతానని చెప్పారు. కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశం మూడు గంటల పాటు హాట్ హాట్ గా సాగింది. ముకుల్ వాస్నిక్ ను అధ్యక్షుడిగా నియమించాలని జీ 23 నేతలు పట్టుబట్టారు. అయితే మెజారిటీ నేతలు మాత్రం రాహుల్ గాంధీ నాయకత్వం కావాలని కోరారు.
పంజాబ్ పాపం?
ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలపై నేతలు అసంతృప్తి వ్యక్తం చేశారు. నాయకత్వం లోపం కారణంగా, రాష్ట్రాల్లో బలమైన నాయకులు లేకపోవడం వల్లనే ఈ సమస్య తలెత్తుతుందన్న అభిప్రాయం ఎక్కువ మందిలో వ్యక్తమయింది. అధికారంలో ఉన్న పంజాబ్ లోనూ పార్టీ ఓటమి ఊహించలేదని, అక్కడ దారుణ ఓటమి చవి చూడటానికి నాయకత్వమే కారణమని జీ23 నేతలు అభిప్రాయపడినట్లు సమచారం. గ్రూపుల సమస్యల వల్లనే పంజాబ్ లో పట్టు కోల్పోవాల్సి వచ్చిందని, ఎప్పటికప్పుడు నిర్ణయాలు తీసుకోవాల్సిన నాయకత్వం నాన్చుడు ధోరణని అవలంబించడం వల్లనే ఈ సమస్య తలెత్తిందని కొందరు అభిప్రాయపడ్డారు.
తాత్కాలిక అధ్యక్షురాలిగా....
రాష్ట్రాల్లో నాయకత్వాన్ని బలపర్చాల్సిన అవసరం ఉందన్న అభిప్రాయం సర్వత్రా వ్యక్తమయింది. రాష్ట్ర నాయకత్వాలు బలంగా ఉంటేనే కేంద్రంలోనైనా అధికారంలోకి రాగలమని మరికొందరు వ్యాఖ్యానించారు. అనేక రాష్ట్రాల్లో బలమైన నాయకులను కోల్పోయిన విషయాన్ని కూడా ఈ సందర్బంగా గుర్తు చేశారు. వీలయినంత త్వరలో సంస్థాగత ఎన్నికలను పూర్తి చేసుకుని కాంగ్రెస్ కు శాశ్వత అధ్యక్షుడిని నియమించాలని నిర్ణయించారు. అప్పటి వరకూ సోనియా గాంధీ తాత్కాలిక అధ్యక్షురాలిగా కొనసాగుతారు.