లీటరు పెట్రోలు రూ.500.. కిలో టమాటా రూ.150
శ్రీలంక ఆర్థిక సంక్షోభం నుంచి ఇప్పుడిప్పుడే బయటపడేలా లేదు. లీటరు పెట్రోలు రూ.500లకు చేరుకుంది
శ్రీలంక ఆర్థిక సంక్షోభం నుంచి ఇప్పుడిప్పుడే బయటపడేలా లేదు. మరికొద్దిరోజులు ఇలాగే కొనసాగితే ప్రజలు బతకలేని పరిస్థితి నెలకొంటుంది. పౌరయుద్ధం ఖాయంగా కన్పిస్తుంది. సామాన్యులు ధనవంతుల ఇళ్లపై పడి దోచుకునే రోజులు అతి దగ్గరలోనే ఉన్నాయి. ప్రస్తుతం శ్రీలంకలో తిండితిప్పలు లేక ప్రజలు అవస్థలు పడుతున్నారు. ధనవంతులు సయితం దాడులకు భయపడి దేశం విడిచి పారిపోతున్నారు.
నిత్యావసరాలు...
ఇదిలా ఉండగా శ్రీలంకలో లీటరు పెట్రోలు రూ.500లకు చేరుకుంది. పెట్రోలు కోసం కిలో మీటర్ల కొద్దీ నిలబడి ఎదురు చూస్తున్నారు. బ్లాక్ లో లీటర్ పెట్రోలు ధర 2,000 రూపాయలుగా ఉంది. కిలో టమాటా రూ.150 లుగా ఉంది. కిలో ఉల్లి పాయలు 200 రూపాయలు, కిలో బంగాళాదుంపలు రూ220లకు విక్రయిస్తున్నారు. కిలో క్యారెట్ రూ.490లకు అమ్ముతున్నారు. పావుకిలో వెల్లుల్లి రూ.160 ల ధర పలుకుతుంది. సామాన్యులు తిండి దొరకక అవస్థలు పడుతున్నారు. ఆకలితో అలమటించి పోతున్నారు.