శ్రీలంక ప్రధాని విక్రమ్‌సింఘే రాజీనామా
శ్రీలంక ప్రధాని రణిల్ విక్రమ్‌సింఘే తన పదవికి రాజీనామా చేశారు.
శ్రీలంక ప్రధాని రణిల్ విక్రమ్‌సింఘే తన పదవికి రాజీనామా చేశారు. శ్రీలంకలో ఆర్థిక సంక్షోభం తీవ్రం కావడం, ఆందోళనలు మరింతగా పెరిగిపోవడంతో ఆయన ఈ నిర్ణయం తీసుకున్నారు. గత మే నెలలోనే అధ్యక్ష బాధ్యతలను చేపట్టిన విక్రమసింఘే వత్తిడి తట్టుకోలేక రాజీనామా చేశారు. శ్రీలంకలో గత మార్చి నుంచి ఆర్థిక సంక్షోభం తలెత్తింది. పౌరులందరూ నిరసనలు చేస్తూ దాడులకు తెగబడుతున్నారు. అధ్యక్ష, ప్రధానులు రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తుండటంతో మహేంద్ర రాజపక్సే, గొటబాయి రాజపక్స దేశం విడిచి పారిపోయారు. తాజాగా విక్రమ్ సింఘే కూడా రాజీనామా చేశారు.
రెండు నెలలకే...
శ్రీలంక ఆర్థిక పరిస్థితులను చక్కదిద్దాలని రిణిల్ విక్రమ్ సింఘే శతవిధాలుగా ప్రయత్నించారు. అన్ని రకాల ఆంక్షలు విధించారు. అప్పులు తెచ్చి ఆర్థిక వ్యవస్థను కుదుటపర్చేందుకు ప్రయత్నించారు. కానీ అన్ని ప్రయత్నాలు విఫలమయ్యాయి. పరిస్థితులు మరింత విషమించాయి. దీంతో నేటి నుంచి ఆందోళన మరింత ఉధృతమయింది. శ్రీలకం రాజధాని రణరంగంగా మారింది. దాడులు పెరుగుతన్నాయి. అఖిలపక్ష ప్రభుత్వ ఏర్పాటుకు సిద్ధమని రణిల్ విక్రమసింఘే ప్రకటించారు. దీంతో రెండు నెలలకే ఆయన చేతులెత్తేసి ప్రధాని పదవికి రాజీనామా చేశారు.