సాగర నగరం సై.. సై..!

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం స్టీల్ సిటీ అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి పెట్టింది. రాబోయే రోజుల్లో కాబోయే పరిపాలన రాజధానిగా విశాఖను మారుస్తామని జగన్ సర్కారు నమ్మకంగా ఉంది. తన హామీలన్నీ నెరవేర్చుకుంటూ వస్తున్న జగన్ మూడు రాజుల రాజధానుల వైపు కూడా వడివడిగా అడుగులు వేస్తున్నారు. 'రాజధాని' కేసు సుప్రీంకోర్టులో పెండింగ్ లో ఉండడంతో ఆయన విశాఖ లో క్యాంపు కార్యాలయాన్ని ప్రారంభించాలని నిర్ణయించారు.

Update: 2023-09-25 03:00 GMT

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం స్టీల్ సిటీ అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి పెట్టింది. రాబోయే రోజుల్లో కాబోయే పరిపాలన రాజధానిగా విశాఖను మారుస్తామని జగన్ సర్కారు నమ్మకంగా ఉంది. తన హామీలన్నీ నెరవేర్చుకుంటూ వస్తున్న జగన్ మూడు రాజధానుల వైపు కూడా వడివడిగా అడుగులు వేస్తున్నారు. 'రాజధాని' కేసు సుప్రీంకోర్టులో పెండింగ్ లో  ఉండడంతో ఆయన విశాఖ లో క్యాంపు కార్యాలయాన్ని ప్రారంభించాలని నిర్ణయించారు. ఈ లోగా విశాఖకు మెరుగులద్దడానికి, ఒక మెట్రోపాలిటన్ సిటీ గా మార్చే ప్రయత్నాలు మొదలయ్యాయి.  నగర అభివృద్ధిని పరుగులు పెట్టించడానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కార్యదర్శి కె.ఎస్. జవహర్ రెడ్డి వైజాగ్ లో సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు. సాగర్ నగరం అభివృద్ధిపై అధికారులకు దిశా నిర్దేశం చేశారు.

అందులో ప్రధానంగా 45 కిలోమీటర్ల పరిధిలో విశాఖ మెట్రో రైల్ ప్రాజెక్ట్ పై దృష్టిపెట్టారు. 2024 జనవరి నాటికి సాంకేతిక వివరాలన్నీ పొందుపరిచి, నివేదిక ఇవ్వాలని సంబంధిత అధికారులు ఆదేశించారు. జగన్మోహన్ రెడ్డి ఎన్నికలకు వెళ్లే లోగా మెట్రో రైల్ కు శంకుస్థాపన చేసే ఉద్దేశంలో ఉన్నట్లు కనిపిస్తుంది. మెట్రో గానీ వస్తే, అది విశాఖ అభివృద్ధికి అది ఒక చోదక శక్తి అవుతుంది అనడంలో ఎలాంటి సందేహం లేదు.

వీటితోపాటు నేషనల్ హిస్టరీ మ్యూజియం, కాపులుప్పాడలో సిగ్నేచర్ టవర్, కన్వెన్షన్ సెంటర్, కైలాసగిరిపై సైన్స్ సిటీ, విశాఖ భీమిలి రోడ్డులో వాటర్ పార్క్, హైదరాబాదులో కళాభారతి లాగా కళావాణి ఇండోర్ స్టేడియం లాంటి నిర్మాణ పనులన్నీ ప్రారంభం కావాలని ప్రధాన కార్యదర్శి అధికారులను ఆదేశించారు.

విశాఖ మెట్రో రైల్ కార్పొరేషన్ మేజిక్ మేనేజింగ్ డైరెక్టర్ యూజెఎం రావు మాట్లాడుతూ మెట్రో రైలు ప్రాజెక్టును నాలుగు దశల్లో రూపొందిస్తున్నట్లు చెప్పారు. మొదటి దశను గాజువాక నుంచి కొమ్మాది వరకు, రెండో దశను గురుద్వారా జంక్షన్ నుంచి పాత పోస్ట్ ఆఫీస్ వరకు, మూడో దశను తాటి చెట్ల పాలెం నుంచి చిన్న వాల్తేరు వరకు నాలుగో దశను కొమ్మాది నుంచి భోగాపురం ఎయిర్పోర్ట్ వరకు నిర్మించినట్లు రావు చెప్పారు. నగరాల అభివృద్ధి కోసం కేంద్రం రూపొందించిన పథకంలో విశాఖపట్నం కూడా చోటు దక్కించుకున్నందు వల్ల  వీఎంఆర్డీఏ పరిధిని విస్తరించాలని ఆయన అధికారులను జవహర్ రెడ్డి ఆదేశించారు. భవిష్యత్తులో కాలుష్యం బారిన పడకుండా పచ్చదనాన్ని పెంచేలా ప్రణాళికలు రూపొందించాలని ఆయన సూచించారు.  

Tags:    

Similar News